PAK vs NZ, T20 World Cup 2021: టాస్ గెలిచిన పాకిస్తాన్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?

|

Oct 26, 2021 | 7:25 PM

ఈ మ్యాచులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

PAK vs NZ, T20 World Cup 2021: టాస్ గెలిచిన పాకిస్తాన్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?
మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చూపిస్తుందనుకున్న టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా పేలవ ప్రదర్శన చూపించి.. పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు పాక్ జట్టు మాత్రం రెండు విజయాలు సాధించి జోరు మీదుంది.
Follow us on

PAK vs NZ, T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో గ్రూపు2లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (PAK vs NZ)తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పాకిస్థాన్ జట్టుకు నేటి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచులో గెలిస్తే దాదాపుగా సెమీస్‌లో చోటు ఖాయం కానుంది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ జట్టుపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచి తగిన బుద్ది చెప్పాలని పాకిస్తాన్ కోరుకుంటుంది.

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్(కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Also Read: SA vs WI, T20 World Cup 2021: డిపెండింగ్ ఛాంపియన్లకు మరోషాక్.. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం..!

Mohammed Shami: ఎట్టకేలకు స్పందించిన బీసీసీఐ.. ఆ బౌలర్ ఆటతో గర్వపడుతున్నామంటూ ట్వీట్..!