PAK vs ENG: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ బౌలర్లకు ఓ పీడకలలా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయగా, ఇంగ్లండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 823 పరుగులు చేసింది. ఓ వైపు పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్లు సెంచరీ సాధించగా, మరోవైపు ఇద్దరు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ జో రూట్, హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీతో ఇన్నింగ్స్ ఆడారు. ఇలాంటి పిచ్‌పై వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్న బౌలర్‌కి సహాయం చేసేందుకు ఫీల్డర్లు ఎంతో సహనం చూపించాల్సి ఉంటుంది. ఎంతటి సహాసమైన చేసి క్యాచ్‌లు పట్టుకోవాల్సిందే. కానీ, ఓ సులవైన క్యాచ్‌ను వదిలేసిన పాక్ స్టార్ ప్లేయర్.. తమ జట్టు ఓటమికి బాటలు వేసినట్లైంది. జో రూట్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం వదిలేశాడు. దీని ద్వారా రూట్ డబుల్ సెంచరీ కొట్టేందుకు బాబర్ సహకరించినట్లైంది. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసి, పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
Na batting ati hai na fielding ati hai or na hi sharam #PAKvsENG | #BabarAzam pic.twitter.com/9Yfib2dPMu
— 𝘼𝙗𝙙𝙪𝙧 𝙍𝙚𝙝𝙢𝙖𝙣 (@was_abdur) October 10, 2024
నసీమ్ షా బౌలింగ్‌లో జో రూట్ అందించిన సులభమైన క్యాచ్‌ను బాబర్ వదులుకున్నాడు. నసీమ్ వేసిన షార్ట్ బంతిని జో రూట్ షార్ట్ మిడ్ వికెట్‌గా ఆడాడు. అక్కడే నిలబడిన బాబర్ ఆజం సులువుగా క్యాచ్ పట్టలేకపోయాడు. బాబర్ పేలవమైన ఫీల్డింగ్ చూసి నసీమ్ షా కూడా నిరాశ చెందాడు. 186 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు రూట్ క్యాచ్‌ను బాబర్ జారవిడిచాడు. బాబర్ ఇచ్చిన ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న రూట్.. డబుల్ సెంచరీతో 262 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రస్తుతం నాలుగో ఆరో పాక్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. వార్త రాసే సమయానికి పాక్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. మరో 143 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సొంతం చేసుకునే దిశగా సాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..