Video: ఓరి నీ బౌలింగ్ తగలెయ్యా.. రాళ్లనే విసిరేసినట్లుందిగా.. పాక్ స్పిన్నర్ శైలిపై గ్రీన్ ఆగ్రహం.. ఏం చేశాడంటే?

Usman Tariq’s bowling action Video: పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ఈ బౌలర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఏకంగా ఆయన శైలి ఎలా ఉందో చేసి చూపించడం గమనార్హం.

Video: ఓరి నీ బౌలింగ్ తగలెయ్యా.. రాళ్లనే విసిరేసినట్లుందిగా.. పాక్ స్పిన్నర్ శైలిపై గ్రీన్ ఆగ్రహం.. ఏం చేశాడంటే?
Usman Tariqs Bowling Action

Updated on: Feb 01, 2026 | 11:21 AM

Usman Tariq’s bowling action: పాకిస్తాన్ తో జరిగిన 2వ టీ20ఐలో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈసారి కంగారుల టీం 90 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఈ ఓటమి తర్వాత, పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలి గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్ లో 20 బంతులు ఎదుర్కొన్న కామెరాన్ గ్రీన్ 2 సిక్సర్లు, 1 ఫోర్ తో 35 పరుగులు చేశాడు.

కానీ, ఉస్మాన్ తారిక్ స్పిన్ దాడిని ప్రారంభించినప్పుడల్లా, కామెరాన్ గ్రీన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా మ్యాచ్ 11వ ఓవర్ 5వ బంతికి క్యాచ్ ఇచ్చి గ్రీన్ పెవిలియన్ వైపు నడిచాడు.

డగౌట్ కు చేరుకున్న కామెరాన్ గ్రీన్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కనిపించాడు. ఇప్పుడు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, పాకిస్తాన్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ పై కొత్త చర్చకు దారితీసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 15.4 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..