Team India: అరంగేట్రం మ్యాచ్‌లో 5 వికెట్లు.. ఇంగ్లీష్ ప్లేయర్లకు సుస్సు పోయించిన టీమిండియా దిగ్గజ బౌలర్..

|

Jan 21, 2023 | 11:09 AM

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ చూస్తే, ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ 246 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1063 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎలో చంద్రశేఖర్ ఏడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీశాడు.

Team India: అరంగేట్రం మ్యాచ్‌లో 5 వికెట్లు.. ఇంగ్లీష్ ప్లేయర్లకు సుస్సు పోయించిన టీమిండియా దిగ్గజ బౌలర్..
Bhagwath Chandrasekhar
Follow us on

భారతదేశం క్రికెట్ ప్రపంచానికి ఎంతోమంది వెటరన్ స్పిన్నర్లను అందించింది. గణాంకాల ప్రకారం, దేశంలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ అనిల్ కుంబ్లే నిలిచాడు. అతను టెస్టుల్లో 619 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. భారతదేశం తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, మొత్తం మీద అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కుంబ్లే కంటే ముందు కూడా చాలా మంది వెటరన్ స్పిన్నర్లు భారత్ తరపున ఆడారు. అందులో లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ కూడా ఒకరు. చంద్రశేఖర్ ఈ రోజు అంటే జనవరి 21న తన టెస్టు అరంగేట్రం చేసి సత్తా చాటి, క్రికెట్ ప్రపంచానికి తానెంటో చాటి చెప్పాడు.

చంద్రశేఖర్ తన తొలి టెస్టు మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్ జనవరి 21 నుంచి జనవరి 26 మధ్య బొంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో (ప్రస్తుతం ముంబై) జరిగింది. ఆ సమయంలో టెస్ట్ మ్యాచ్‌లలో రెస్ట్ డే ఉండేది.

తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్‌..

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 300 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 183 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసిన సలీం దురానీ 90 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు బాదాడు. చందూ బోర్డే ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో 84 పరుగులు చేశాడు. అతను 280 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు. రెండో రోజు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత చంద్రశేఖర్‌ తన స్పిన్‌ సత్తాను చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. ఇందులో 46 పరుగులు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ స్మిత్, 12 పరుగులు చేసిన బారీ నైట్, జిమ్మీ బింక్స్ (10), జాన్ ప్రైస్ (32) వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

భారత్‌ 67 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 249 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో దిలీప్ సర్దేశాయ్, మోత్గనహళ్లి జయసింహ తలో 66 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. విజయ్ మంజ్రేకర్ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో చంద్రశేఖర్ ఒక వికెట్ తీశాడు.

చంద్రశేఖర్ కెరీర్..

చంద్రశేఖర్ కెరీర్‌ను పరిశీలిస్తే .. దాదాపు 15 ఏళ్ల పాటు భారత్ తరపున క్రికెట్ ఆడాడు. ఈ ఆటగాడు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్‌తో ఆడాడు. అతను ఈ మ్యాచ్‌ను 12 నుంచి 16 జూలై 1979 వరకు బర్మింగ్‌హామ్‌లో ఆడాడు. భారతదేశం తరపున 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 242 వికెట్లు తీశాడు. దీంతో పాటు ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. ఏకైక వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ చూస్తే, ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ 246 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1063 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎలో చంద్రశేఖర్ ఏడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..