On This Day: టీమిండియాపై అరంగేట్రంతో సీన్ రివర్స్.. కెరీర్ ఖేల్ ఖతం.. ఈ బ్యాడ్‌లక్ ప్లేయర్ ఎవరంటే?

|

Jan 09, 2023 | 8:45 AM

గారెత్ బ్రిడ్జ్... ఈ మాజీ వెస్టిండీస్ ఆల్‌రౌండర్, టీమిండియాపై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు...

On This Day: టీమిండియాపై అరంగేట్రంతో సీన్ రివర్స్.. కెరీర్ ఖేల్ ఖతం.. ఈ బ్యాడ్‌లక్ ప్లేయర్ ఎవరంటే?
Cricket
Follow us on

గారెత్ బ్రిడ్జ్… ఈ మాజీ వెస్టిండీస్ ఆల్‌రౌండర్, టీమిండియాపై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సీన్ కట్ చేస్తే.. అదే అతడికి చివరి మ్యాచ్ అయింది. కెరీర్ కాస్తా ఖేల్ ఖతం. గారెత్ తన మొదటి మ్యాచ్‌లోనే భారత దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్‌ను ఎదుర్కున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ వీరిద్దరి మధ్య జరిగిన యుద్దంలో హర్భజనే పైచేయి సాధించాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన సత్తా చాటినప్పటికీ.. ఈ మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ జట్టులోకి గారెత్ తిరిగి రాలేకపోయాడు. 125 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4,693 పరుగులు, 287 వికెట్లు తీసిన గారెత్ ఈరోజు 47వ ఏటలోకి అడుగుపెట్టాడు.

9 జనవరి 1976న జమైకాలో జన్మించిన గారెత్ తన కెరీర్‌లో ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడగలిగాడు. అక్టోబర్ 2002లో చెన్నైలో టీమిండియాపై అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడ్ని హర్భజన్ సింగ్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన గారెత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. మరోవైపు బ్యాట్‌తో పేలవ ప్రదర్శన కనబరిచిన గారెత్.. బంతితో మాత్రం భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. వీవీఎస్ లక్ష్మణ్, పార్థివ్ పటేల్‌లను తన పదునైన బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. అయితే అతడికి మరిన్ని అవకాశాలు రావడానికి ఈ ప్రదర్శన సరిపోలేదు. అందుకే తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్‌లో వెస్టిండిస్ విజయం సాధించినా.. గారెత్‌కు మాత్రం అదే చివరి మ్యాచ్ అయింది.

కాగా, వెస్టిండీస్‌కు చెందిన గారెత్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించాడు. అతడు జమైకా, డర్హామ్ తరపున మొత్తం 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతడు 188 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 2206 పరుగులు, 195 వికెట్లు తీశాడు. అలాగే 106 డొమెస్టిక్ టీ20 మ్యాచుల్లో 765 పరుగులు చేసి 93 వికెట్లు పడగొట్టాడు. 2014లో, అతడు తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ని వార్విక్‌షైర్‌తో ఆడాడు.