World Cup 2023: వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ బిర్యానీయే తమ కొంప ముంచిందని ఆ జట్టు వైస్ కెప్టెన్ షదాబ్ ఖాన్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం భారత్‌కి వచ్చిన పాకిస్తాన్ జట్టు తమ రెండు వార్మప్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలోనే ఆడి, ఓడిపోయింది. ఇలా భారత్‌కి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ, హైదరాబాద్ బిర్యానీ తింటూ ఉన్నారు పాక్ ప్లేయర్లు. ఈ కారణంగానే మైదానంలో కొంచెం బద్ధకిస్తున్నామని మంగళవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత షదాబ్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంపై షదాబ్ స్పందిస్తూ.. ‘ఫలితాలు ముఖ్యం కాదు. మేము చాలా నేర్చుకున్నాం. మా ఆట బాగుంది, ఫలితం మా చేతుల్లో లేదు. మా ప్లేయింగ్ ఎలెవన్ కుదిరింది, బెంచ్‌కి పరిమితమైన ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లతో ఆడినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడి పరిస్థితులపై కూడా కొంత అవగాహన ఏర్పడింది’ అన్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బిర్యానీపై అడిగిన ఓ ప్రశ్నకు షబాద్ సమాధానమిస్తూ ‘మేము రోజూ హైదరాబాద్ బిర్యానీ తింటున్నాం. బహుశా అందుకే మేము కొంచెం స్లో అవుతున్నాం’ అని నవ్వుతూ అన్నాడు.
Shadab Khan 🗣️:-
"Yes, We have been having it daily and that's perhaps why we are a bit slow in the field"
(On tried Hyderabadi Biryani)#ODIWorldCup2023 #cricket#PAKvsAUS Babar #earthquake #AyezaKhan Chacha , Jemima pic.twitter.com/MPWkutB4MT
— Cricket Updates🔜 (@cricketnews03) October 3, 2023
కాగా, అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ తమ వన్డే వరల్డ్ కప్ కాంపెయిన్‌ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుండగా.. పాకిస్తాన్ మిగిలిన షెడ్యూల్ ఇలా ఉంది..
అక్టోబర్ 6 — పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (హైదరాబాద్)
అక్టోబర్ 10 — పాకిస్తాన్ vs శ్రీలంక (హైదరాబాద్)
అక్టోబరు 14 — పాకిస్తాన్ vs భారత్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 20 — పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా (బెంగళూరు)
అక్టోబర్ 23 — పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ (చెన్నై )
అక్టోబర్ 27 — పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా (చెన్నై )
అక్టోబర్ 31 — పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ (కోల్‌కతా)
నవంబర్ 4 — పాకిస్తాన్ vs న్యూజిలాండ్ (బెంగళూరు )
నవంబర్ 11 — పాకిస్తాన్ vs ఇంగ్లాండ్ (కోల్‌కతా)
బాబర్ ఆజాం (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిదీ, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా
రిజర్వ్ ప్లేయర్స్: మహ్మద్ హరీస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..