David Warner: ఎంటర్‌టైన్మెంట్ తగ్గేదేలే.. ఉప్పల్ స్టేడియంలో ‘పుష్పరాజ్’ స్టెప్పులేసిన హైదరాబాద్ మాజీ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియోలు..

|

Oct 04, 2023 | 9:04 AM

ODI World Cup 2023: ప్రపంచ క్రికెట్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు వారి దేశంలో కంటే మన దేశంలోనే అభిమానులు ఎక్కువ. అలాంటి క్రికెటర్ల లిస్టులో అగ్రస్థానం ఎప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌దే. హైదరాబాద్ తరఫున ఆడుతున్న రోజుల నాటి నుంచే తెలుగు పాటలు, డైలాగులకు డబ్‌స్మాష్ చేస్తూ తెలుగు అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు వార్నర్. ఈ కారణంగానే వార్నర్‌ని హైదరాబాద్ ఐపీఎల్ జట్టు..

David Warner: ఎంటర్‌టైన్మెంట్ తగ్గేదేలే.. ఉప్పల్ స్టేడియంలో ‘పుష్పరాజ్’ స్టెప్పులేసిన హైదరాబాద్ మాజీ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియోలు..
David Warner
Follow us on

ODI World Cup 2023: ప్రపంచ క్రికెట్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు వారి దేశంలో కంటే మన దేశంలోనే అభిమానులు ఎక్కువ. అలాంటి క్రికెటర్ల లిస్టులో అగ్రస్థానం ఎప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌దే. హైదరాబాద్ తరఫున ఆడుతున్న రోజుల నాటి నుంచే తెలుగు పాటలు, డైలాగులకు డబ్‌స్మాష్ చేస్తూ తెలుగు అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు వార్నర్. ఈ కారణంగానే వార్నర్‌ని హైదరాబాద్ ఐపీఎల్ జట్టు వదులుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు వదులుకోలేదు. ఇక మంగళవారం జరిగిన పాకిస్తాన్-ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ జరుగుతుండగా వార్నర్ మరో సారి తన అభిమానులకు అలరించాడు. స్టేడియంలో పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి పాట’ వినపడగానే డేవిడ్ వార్నర్ కాస్త ‘డేవిడ్ రాజ్’గా మారిపోయాడు. వెంటనే అల్లు అర్జున్ మాదిరిగా పాటలోని హూక్ స్టెప్పుల కోసం కాలు కదిపాడు. అంతే ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలు, కేకలతో దద్దరిల్లింది.

డేవిడ్ వార్నర్ అక్కడితో ఆగిపోలేదు. పాక్ ప్లేయర్ అబ్దుల్లా షఫిక్ కొట్టిన షాట్‌ని అందుకున్న ‘తగ్గేదేలే’ అంటూ పుష్పరాజ్ మానరిజమ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ముందుగా వేసిన శ్రీవల్లి పాట స్టెప్పులు, తగ్గేదేలే అంటూ చేసిన మానరిజమ్‌కి సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై క్రికెట్ అభిమానులు తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తెలుగు క్రికెట్ అభిమానులు ‘వార్నర్ మామ, నువ్వు ఎప్పటికీ మావోడివే’ అంటూ కామెంట్ చేస్తున్నాడు.

కాగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్తాన్ 337 పరుగులకే పరిమితమైంది. దీంతో 14 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో వార్నర్ 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.

ఆతిథ్య భారత్‌తో తొలి మ్యాచ్‌లోనే తలపడే ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఎలా ఉందంటే..

మ్యాచ్ 1: అక్టోబర్ 8 – భారత్ vs ఆస్ట్రేలియా (చెన్నై)

మ్యాచ్ 2: అక్టోబర్ 12 – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (లక్నో)

మ్యాచ్ 3: అక్టోబర్ 16 – ఆస్ట్రేలియా vs శ్రీలంక (లక్నో)

మ్యాచ్ 4: అక్టోబర్ 20 – ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ (బెంగళూరు)

మ్యాచ్ 5: అక్టోబర్ 25 – ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ (ఢిల్లీ)

మ్యాచ్ 6: అక్టోబర్ 28 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ (ధర్మశాల)

మ్యాచ్ 7: నవంబర్ 4 – ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (అహ్మదాబాద్)

మ్యాచ్ 8: నవంబర్ 7 – ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ (ముంబై)

మ్యాచ్ 9: నవంబర్ 11 – ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ (పూణే)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..