New Zealand Vs Bangladesh: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే వరకు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దీంతో బంగ్లా విజయానికి అడుగులు వేస్తోంది. మరో ఐదు వికెట్లు పడగొడితే బంగ్లా విజయాన్ని ఆడపం న్యూజిలాండ్ తరం కాదు. ప్రస్తుతానికి న్యూజిలాండ్ టీం 17 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆట నిలిచిపోయే సమయానికి రాస్ టేలర్ (37), రచిన్ రవీంద్ర (6) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది.
నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ పరిస్థితి దారుణంగా మారింది. ఫాస్ట్ బౌలర్ ఇబాదత్ హొస్సేన్ ఏడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. దీంతో కివీస్ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఒకానొక సమయంలో విల్ యంగ్ (69), రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, ఇబాదత్ హొస్సేన్ చివరి గంటలో యంగ్, హెన్రీ నికోల్స్ (0), టామ్ బ్లండెల్ (0)లను పెవిలియన్ చేర్చి బంగ్లాదేశ్ స్థానాన్ని పటిష్టం చేశాడు. ఇక చివరి రోజు న్యూజిలాండ్ టీం ఏమేరకు తన వికెట్లను కాపాడుకుంటుందో చూడాలి.
Also Read: India vs South Africa ODI Series: ఇద్దరు ‘ఛాంపియన్’లతో గబ్బర్ శిక్షణ.. వైరలవుతోన్న ఫొటో
IPL 2022: అహ్మదాబాద్ హెచ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్.. ఇతర సిబ్బంది కూడా ఫిక్స్?