Virat Kohli: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన దిలీప్ వెంగ్‎సర్కార్.. కోహ్లీ టెస్ట్‎లపై దృష్టి పెట్టగలడంటూ వ్యాఖ్యలు..

|

Dec 11, 2021 | 10:58 AM

మాజీ సెలెక్టర్, మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్ల నియామకం విషయమై బీసీసీఐని సమర్థించాడు. టెస్ట్, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం తప్పు కాదన్నారు....

Virat Kohli: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన దిలీప్ వెంగ్‎సర్కార్.. కోహ్లీ టెస్ట్‎లపై దృష్టి పెట్టగలడంటూ వ్యాఖ్యలు..
Virat
Follow us on

మాజీ సెలెక్టర్, మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్ల నియామకం విషయమై బీసీసీఐని సమర్థించాడు. టెస్ట్, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం తప్పు కాదన్నారు. ఒకప్పుడు జట్టు సెలెక్టర్‌గా ఉన్న వెంగ్‌సర్కర్ వేర్వేరు కెప్టెన్సీ సమీప భవిష్యత్తులో జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. “ODIలు, T20I లలో రోహిత్ శర్మను భారత వైట్-బాల్ కెప్టెన్‌గా చేయడంలో BCCI సరైన చర్య తీసుకుంది. గత కొంతకాలంగా రోహిత్ బాగా రాణిస్తున్నాడు. అతను కెప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది మంచి చర్యగా నేను భావిస్తున్నాను” అని వెంగ్‌సర్కార్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నాడు.

“ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టగలడు, రోహిత్ వైట్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టగలడు. అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు అనేక టైటిళ్లను అందించాడు.” అని భారత మాజీ బ్యాటర్ చెప్పాడు. వన్డే కెప్టన్‌‎గా రోహిత్ శర్మను నియమించడం కొందరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అతని కెప్టెన్సీ రికార్డు బాగున్నా పక్కన పెట్టారు. కోహ్లీ T20 వరల్డ్ కప్‎కు ముందే తాను టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.

“క్రికెట్‎లో వేర్వేరు కెప్టెన్లు ఉండడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు జట్లు ఇప్పటికే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇంగ్లాండ్ ODI,T20 లకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉండగా, జో రూట్ టెస్ట్‌లలో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు రాణిస్తోంది. జో రూట్, ఇయాన్ మోర్గాన్ ఇద్దరూ టెస్ట్, వైట్-బాల్ కెప్టెన్లుగా బాగా రాణిస్తున్నారు. స్ప్లిట్ కెప్టెన్సీ విరాట్, రోహిత్ ఇద్దరికీ కలిసి వస్తుంది. వారిపై ఒత్తిడిని తగ్గుతుంది. ఆటపై మెరుగ్గా దృష్టి పెట్టగలరు” అని దిలీప్ వెంగ్‌సర్కార్ చెప్పాడు.

Read Also.. Aus vs Eng: బ్రిస్బేన్‌ టెస్ట్‎లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. రాణించిన హెడ్, వార్నర్, కమ్మిన్స్, లియాన్..