India vs Australia: పాత పంత్‌నే… ప‌రిప‌క్వ‌త సాధించా… అయినా దేశం కోసం మ్యాచ్‌ను గెలిపిస్తే ఆ కిక్కే వేర‌ప్పా…

| Edited By:

Jan 24, 2021 | 1:22 PM

ఆస్ట్రేలియాలో జ‌రిగిన బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ టెస్టు సిరీస్ భార‌త్ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన రిష‌బ్ పంత్ స్వ‌దేశం తిరిగి వ‌చ్చిన త‌ర్వాత మీడియాతో...

India vs Australia: పాత పంత్‌నే... ప‌రిప‌క్వ‌త సాధించా... అయినా దేశం కోసం మ్యాచ్‌ను గెలిపిస్తే ఆ కిక్కే వేర‌ప్పా...
Follow us on

ఆస్ట్రేలియాలో జ‌రిగిన బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ టెస్టు సిరీస్ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన రిష‌బ్ పంత్ స్వ‌దేశం తిరిగి వ‌చ్చిన త‌ర్వాత మీడియాతో మాట్లాడాడు. ఆసీస్ ప‌ర్య‌ట‌న అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. అవి మీకోసం…

దేశం కోసం ఆడుతా…

ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో రాణించ‌డం సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చివ‌రి రెండు టెస్టుల్లో క‌న‌బ‌ర్చిన ప్ర‌ద‌ర్శ‌న సంతృప్తిని ఇచ్చింది. అయితే నేను ఎప్పుడు వ్య‌క్తిగ‌త స్కోరు కోసం ఆడ‌లేదు. దేశం కోసం ఆడ‌తా… ఓ మ్యాచ్‌లో 97 ప‌రుగులు సాధించా. అయితే వాటి కంటే ఇండియా గెలుపు కోసం చేసే 20 ప‌రుగులే గొప్ప‌వి.

ఆట‌ను ఎంజాయ్ చేస్తా…

నేను ఇప్ప‌టికీ అండ‌ర్ 19 ఆడిన పంత్‌నే. అప్ప‌టిలానే ఇప్పుడు క్రికెట్ ఆడ‌డాన్ని ఎంజాయ్ చేస్తా. కాక‌పోతే వ్య‌క్తిత్వం ప‌రంగా మార్పు వ‌చ్చింది. ఆలోచ‌న ధోర‌ణి మారింది. వ్య‌క్తిగ‌తంగా ప‌రిప‌క్వ‌త సాధించా. కొద్దిగా ఆగి ఆలోచించి ఆడుతున్నా… ఈ తీరును మీరు ఆసీస్ సిరీస్ గ‌మ‌నించే ఉంటారు. అయితే దూకుడుగా ఆడ‌డం నాకు మొద‌టి నుంచే అల‌వాటు.

లాక్‌డౌన్ ఉప‌యోగ‌ప‌డింది…

2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపిక కాక‌పోవ‌డం బాధించింది. కొద్దిగా డిప్రెష‌న్‌కు సైతం గుర‌య్యా. అయితే లాక్‌డౌన్ స‌మ‌యం న‌న్ను నేను తెలుసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. కుటుంబం, స్నేహితుల‌తో గ‌డిపే వీలును క‌ల్పించింది. వారు సైతం నాకు అండ‌గా ఉన్నారు.

గెలుపు ఇచ్చే కిక్కే వేరు…

వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న క‌న్నాదేశం గెలుపు కోసం చేసే ప‌రుగులే నా దృష్టిలో విలువైన‌వి. అయినా పేరు కోసం ఆడే ఆట కంటే దేశం కోసం ఆట‌లోనే కిక్కు ఉంది. ఇక మ‌న‌మే ఆ గెలుపున‌కు కార‌ణం అయితే ఆ కిక్కే వేరు. ఆసీస్ టూర్ నాకు ఓ గొప్ప మ‌ధురానుభూతి. ఆట‌ను, గెలుపును ఆస్వాదిస్తున్నా.