Richest Cricketers : విరాట్ కోహ్లీ, ధోనీలు కాదు… ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా ? టాప్ 5 లిస్ట్ ఇదే!

క్రికెట్ ప్రపంచంలో కేవలం ఒక ఆట కాదు, అది ఇప్పుడు ఒక భారీ పరిశ్రమగా మారింది. చాలామంది క్రికెటర్లు ఆటతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారి నికర విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.

Richest Cricketers : విరాట్ కోహ్లీ, ధోనీలు కాదు... ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా ?  టాప్ 5 లిస్ట్ ఇదే!
Richest Cricketers

Updated on: Aug 23, 2025 | 12:45 PM

Richest Cricketers : ప్రపంచంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. చాలా మంది క్రికెటర్లు ఆటతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఉన్నారు. వీరి నికర ఆస్తి 100 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ధనవంతులైన క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. సచిన్ టెండూల్కర్

క్రికెట్ దేవుడని పిలువబడే సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి సుమారు 170 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1400 కోట్లకు పైగా). అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఆదాయం నిరంతరంగా కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తూ, అనేక స్పోర్ట్స్ అకాడమీలు, రెస్టారెంట్లు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.

2. విరాట్ కోహ్లీ

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బ్రాండ్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి సుమారు 127 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1050 కోట్లకు పైగా)క్రికెట్ కాంట్రాక్టులతో పాటు, తన ఫిట్‌నెస్, ఫ్యాషన్ బ్రాండ్లైన (Rogue, One8), ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ముంబై, గురుగ్రామ్‌లో అతనికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.

3. ఎంఎస్ ధోని

భారతదేశంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోని ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి 123 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1000 కోట్లకు పైగా)క్రికెట్‌తో పాటు, వ్యవసాయం, జిమ్ చైన్లు, ప్రొడక్షన్ కంపెనీ మరియు టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్‌లో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంది.

4. రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత కోచింగ్, కామెంటరీ ద్వారా తన కెరీర్‌ను కొనసాగించారు. ఆయన గతంలో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. టీవీ, డిజిటల్ మీడియా ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఆయన ఆస్తి సుమారు 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ.580 కోట్లకు పైగా)

5. బ్రయాన్ లారా

వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రయాన్ లారా ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తులు 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లు+). ఆయన కామెంటరీ, కోచింగ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. లారా గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..