సుమారు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, దిగ్బ్రాంతి చెందే సంఘటనలు జరిగాయి. బ్యాట్స్‌మెన్లు రికార్డు స్కోర్లు నమోదు చేయడం చూశాం.. బౌలర్ల అద్భుత గణాంకాలు, అపురూపమైన విజయాలు నమోదు చేసుకున్న జట్లు, అత్యంత చెత్త ప్రదర్శనలు.. ఇలా చాలానే ఉన్నాయి. వాటిల్లో నుంచి ఓ చాప్టర్ కౌంటీ క్రికెట్‌లో జరిగిన అత్యంత చెత్త మ్యాచ్. ఇది ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓ జట్టు 12 ఓవర్లు ఆడి.. కేవలం 12 పరుగులకే ఆలౌట్ అయింది.. అంతేకాదు.. 6గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయి వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్ ఇటీవల జరిగింది కాదులెండి.. 115 ఏళ్ల కిందట ఇదే రోజు ఈ షాకింగ్ మ్యాచ్ ఇంగ్లాండ్ కౌంటీలో చోటు చేసుకుంది.
1907 జూన్ 11న ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లౌసెస్టర్‌షైర్, నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్లబ్ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గ్లౌసెస్టర్‌షైర్.. నార్తాంప్టన్‌షైర్ బౌలర్ల ధాటికి కేవలం 60 పరుగులకే ఆలౌటైంది. నార్తాంప్టన్‌షైర్ బౌలర్లలో జీజే థాంప్సన్, ఈస్ట్ చెరో 5 వికెట్లు పడగొట్టారు. అయితే ఇది కాదు సినిమాలో ట్విస్ట్.. కథలో ముందుండి అసలైన మలుపు.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన నార్తాంప్టన్‌షైర్ కేవలం గంట వ్యవధిలోనే గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్ల ధాటికి కేవలం 11.3 ఓవర్లకే 12 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇది కౌంటీ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరు.. అంతేకాదు ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు. గ్లౌసెస్టర్‌షైర్ ఫాస్ట్ బౌలర్ ఈజీ డెన్నెట్ నార్తాంప్టన్‌షైర్ బ్యాటింగ్ లైనప్‌ను పెవిలియన్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 6 ఓవర్లు వేసిన డెన్నెట్ 8 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్ జట్టులో 6గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ లో 6 బ్యాట్స్ మెన్ ల ఖాతా కూడా తెరవలేకపోయాడు.
దీనికి సమాధానంగా గ్లౌసెస్టర్‌షైర్ రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేసింది. దీనితో ఫైనల్‌గా మ్యాచ్ గెలవాలంటే నార్తాంప్టన్‌షైర్‌కు 137 పరుగులు కావాల్సి ఉంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నార్తాంప్టన్‌షైర్ తడబడింది. 40 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. కానీ అప్పట్లో టెస్ట్ మ్యాచ్‌లు మూడు రోజుల పాటు జరిగడం వల్ల.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించిన డెన్నెట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుపులు మెరిపించి 7 వికెట్లు పడగొట్టాడు. వెరిసి ఆ మ్యాచ్ మొత్తానికి 15 వికెట్లు తీశాడు.