IND vs NZ: 4 బంతుల్లో 4 సిక్సర్లు.. ఒక్క ఓవర్‌తో చెత్త రికార్డులో తెలుగోడు..!

India vs New Zealand: ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత బౌలర్లకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) వేసిన 16వ ఓవర్ పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక్క ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకోవడంతో నితీశ్ చెత్త రికార్డు జాబితాలో చోటు సంపాదించాడు.

IND vs NZ: 4 బంతుల్లో 4 సిక్సర్లు.. ఒక్క ఓవర్‌తో చెత్త రికార్డులో తెలుగోడు..!
Ind Vs Nz 4th T20i Nitish Kumar Reddy

Updated on: Oct 30, 2026 | 7:45 PM

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips), మైకేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) వేసిన 16వ ఓవర్ భారత్‌కు భారీ నష్టం చేసింది. ఈ ఒక్క ఓవర్‌లోనే నితీశ్ 32 పరుగులు ఇచ్చాడు.

ఓవర్ తొలి బంతికి మైకేల్ బ్రేస్‌వెల్ ఒక పరుగు తీశాడు. రెండో బంతి నోబాల్‌గా మారడంతో అదనపు పరుగులు వచ్చాయి. ఫ్రీహిట్ బంతికి గ్లెన్ ఫిలిప్స్ రెండు పరుగులు తీసుకున్నాడు. అక్కడి నుంచి అసలు విధ్వంసం మొదలైంది.

ఓవర్‌లోని చివరి నాలుగు బంతులను ఫిలిప్స్ వరుసగా సిక్సర్లుగా మలిచాడు. ఒక్కో బంతిని బౌండరీ దాటిస్తూ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో నితీశ్ ఖాతాలో ఒక్క ఓవర్‌కే 32 పరుగులు చేరాయి. ఫిలిప్స్ విధ్వంసం, బ్రేస్‌వెల్ సహకారంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. భారత బౌలర్లలో నితీశ్‌కు ఈ ఓవర్ మాత్రం పూర్తిగా పీడకలగా మారింది.

చెత్త రికార్డు జాబితాలో నితీశ్..

ఈ 32 పరుగుల ఓవర్‌తో నితీశ్ కుమార్ రెడ్డి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. మాజీ భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ (Stuart Binny)తో కలిసి ఈ చెత్త రికార్డును పంచుకున్నాడు.

భారత బౌలర్లు ఒక ఓవర్‌లో ఇచ్చిన అత్యధిక పరుగులు:

34 పరుగులు – శివమ్ దూబే (Shivam Dube) vs న్యూజిలాండ్, 2020

32 పరుగులు – స్టువర్ట్ బిన్నీ vs వెస్టిండీస్, 2016

32 పరుగులు – నితీశ్ కుమార్ రెడ్డి vs న్యూజిలాండ్, 2026

29 పరుగులు – రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) vs ఇంగ్లండ్, 2026

అంటే నితీశ్ కంటే ముందు ఈ జాబితాలో ఉన్నది శివమ్ దూబే మాత్రమే. 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబే ఒక ఓవర్‌లో 34 పరుగులు ఇచ్చాడు.

ఒక ఓవర్‌లో నాలుగు వరుస సిక్సర్లు కొట్టించుకోవడం నితీశ్‌కు భారీ దెబ్బగా మారింది. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని న్యూజిలాండ్ స్కోరును భారీ స్థాయికి తీసుకెళ్లాడు. ఒక్క ఓవర్.. 32 పరుగులు.. నాలుగు సిక్సర్లు! నితీశ్‌కు మాత్రం ఇది మర్చిపోలేని ఓవర్‌గా మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us