ఇంగ్లాండ్ వన్డే టీంపై కరోనా పంజా విసిరింది. వన్డే జట్టులోని ఏడుగురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముగ్గురు క్రికెటర్లకు, నలుగురు టీం మేనేజ్‌మెంట్ సభ్యులకు కరోనా తేలిందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీనితో జూలై 8వ తేదీ(గురువారం) నుంచి కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా మార్పులు చేసింది.
బెన్ స్టోక్స్ సారధ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. తొమ్మిది మంది అన్‌క్యాప్ద్ ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు ఆగష్టు 4 నుంచి ఇండియాతో టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తలబడనున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా సోకిన ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరన్నది ఈసీబీ బహిర్గతం చేయలేదు. జానీ బెయిర్‌స్టో, రాయ్, ఆదిల్ రషీద్ లాంటి ప్లేయర్స్ అటు టెస్టుల్లో కూడా ఆడుతుండటంతో.. వీళ్లలో ఎవరికైనా కరోనా సోకితే.. ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.
Unprecedented times but a proud moment for our nine potential debutants.#ENGvPAK pic.twitter.com/ZoNbJln0HO
— England Cricket (@englandcricket) July 6, 2021
We have named a new 18-strong group for the Royal London Series against Pakistan.
— England Cricket (@englandcricket) July 6, 2021
The ECB can confirm that seven members of the England Men’s ODI party have tested positive for COVID-19.
— England Cricket (@englandcricket) July 6, 2021