T20 World Cup 2021: కప్ గెలవకపోయినా అతడి స్థాయి తగ్గదు.. ఈ సారి కప్ కివీస్‎దే.. వచ్చే ప్రపంచ కప్‎లో వారు రాణిస్తారు..

|

Nov 09, 2021 | 6:44 PM

టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. భారత జట్టు వైఫల్యానికి గల కారణాలను వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్లైవ్ లాయిడ్‎ న్యూస్9తో మాట్లాడారు...

T20 World Cup 2021: కప్ గెలవకపోయినా అతడి స్థాయి తగ్గదు.. ఈ సారి కప్ కివీస్‎దే.. వచ్చే ప్రపంచ కప్‎లో వారు రాణిస్తారు..
Clive Lloyd
Follow us on

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈ వరల్డ్ కప్‎లో టీం ఇండియా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. భారత జట్టు వైఫల్యానికి గల కారణాలను వెస్టిండీస్ మాజీ క్లైవ్ లాయిడ్‎ న్యూస్9తో మాట్లాడారు. రెండు వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకున్న వెస్టిండీస్ జట్టకు (1975, 1979) లాయిడ్ కెప్టెన్‎గా ఉన్నారు.

భారత్ తరఫున ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడంలో విరాట్ కోహ్లీ విఫలమవడం కెప్టెన్‌గా అతని స్థాయిని తగ్గించదని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ అన్నారు. రెండుసార్లు (2012, 2016) ఛాంపియన్‌లుగా ఉన్న కరీబియన్లు 2022 టీ20 ప్రపంచ కప్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించాలంటే తమ ఆట తీరును మెరుగు పరుచుకోవాలన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో 2022 టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది.

యూఏఈలో భారత్‌ ఫ్లాప్‌ షోతో టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి తీవ్ర నిరాశను మిగిల్చిందా. అతను భారత జట్టుకు నాయకత్వం వహించిన నాలుగు ఐసీసీ ఈవెంట్లో ఒక్క టైటిల్ కూడా గెలవకుండానే అతను నిష్క్రమించాడు. ఆస్ట్రేలియాలో ఇండియా మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంతో సహా ఆకట్టుకునే ట్రాక్ రికార్డ్‌ మరుగునపడిపోయిందటారా?..

కోహ్లీ నాయకత్వంలో ఇండియా బలీయమైన జట్టుగా ఎదిగింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశ నుండి నిష్క్రమించినప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో ఇండియా ఒకటి. విరాట్ చాలా సంవత్సరాలుగా దేశం కోసం చాలా బాగా ఆడాడు. ప్రపంచ కప్ గెలవకపోయినా అతనిని విఫల కెప్టెన్‌గా చూడలేం. అతను భారత జట్టుకు అద్భుతమైన సేవ చేశాడు. రాబోయే రోజుల్లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనను చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాలు భారత్ నాకౌట్ ఆశలను ఆవిరి చేసింది. ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై భారీ విజయాలు సాధించినా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇండియా 2012 తర్వాత ఇండియా నాకౌట్ వెళ్లకపోవడం ఇదే మొదటిసారి దీనిపై ఏమంటారు?..

పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో భారత్ అత్యుత్తమంగా ఆడలేదు. అయినప్పటికీ, వారు ఇప్పటికీ టీ20 అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉన్నారు. వారు వన్డేలు, టీ20లు, టెస్ట్ క్రికెట్‌లలో చాలా బాగా రాణించారు. వారు గొప్ప పునరాగమనం చేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.

టోర్నమెంట్ గ్రూప్ దశలోనే ఇండియా నిష్క్రిమిచండం వల్ల వీక్షకుల సంఖ్యను ప్రభావితం చేస్తుందా.. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయంతో విండీస్ పేలవ ప్రదర్శన నిరాశ పరిచిందా?..

భారత్ సెమీస్‌కు చేరుకోకపోవడంతో నేను నిరాశ చెందాను. సెమీ-ఫైనల్స్‌లో భారత్ ఇక్కడ ఉంటే, ఈ స్థలం నిండిపోయి ఉండేది. భారత జట్టు నాకౌట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టేడియం లోపల వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసు. కొంచెం నిరాశపరిచింది. వెస్టిండీస్‌కు వారు సరిగా ఆడలేదు, కానీ వారు కొంత పునరాలోచన చేసి తదుపరి ప్రపంచకప్‌లో మెరుగైన జట్టుగా అవతరిస్తారని నేను ఆశిస్తున్నాను.

బుధవారం జరిగే తొలి సెమీస్‌లో కివీస్‌ ఇంగ్లండ్‌తో తలపడుతుంది. గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. వీటిలో గెలిచినవారు ఆదివారం ఫైనల్‎ పోరులో పాల్గొంటారు. ఏ జట్టు కప్ గెలిచే అవకాశం ఉంది?.

ఎవరు గెలుస్తారో నేను మీకు చెప్పను. ఆస్ట్రేలియా చాలా బాగా ఆడింది, పాకిస్తాన్ చాలా బాగా ఆడింది. ఇంగ్లాండ్ వైట్-బాల్ క్రికెట్‌కు పవర్‌హౌస్. కానీ అంచనా ప్రకారం కప్ న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్‎ల్లో వారు ఆడిన తీరు ఆకట్టుకుంది. వారు మొదటగా వెనుకబడి ఉన్నప్పటికీ తర్వాత పుంజుకున్నారు. వారు ఆడిన అన్ని మ్యాచ్‎ల్లో తెలివిగా ఆడారు. వారు సెమీ-ఫైనల్స్‌, ఫైనల్స్‌లో కూడా గెలిచే అవకాశం ఉందని క్లైవ్ లాయిడ్ అన్నాడు.

Read Also.. T20 World Cup 2021: పాకిస్థాన్‌ విజయాల్లో ఆ 5 ప్లేయర్సే కీలకం.. జట్టుకు మ్యాచ్ విన్నర్స్.!