Axar Patel: ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి టీమిండియా ఆటగాళ్ల ప్రత్యేక పూజలు.. ‘భస్మ హారతి’లో పాల్గొన్న అక్షర్ పటేల్ దంపతులు..

|

Feb 27, 2023 | 5:01 PM

అక్షర్ పటేల్ అతని భార్య మేహా పటేల్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Axar Patel: ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి టీమిండియా ఆటగాళ్ల ప్రత్యేక పూజలు.. ‘భస్మ హారతి’లో పాల్గొన్న అక్షర్ పటేల్ దంపతులు..
Cricketer Axar Patel Visits Mahakaleshwar Temple
Follow us on

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ అనంతరం మహాదేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. చివరి రోజు అంటే ఫిబ్రవరి 26న టీమిండియా ఆటగాళ్లు, కేఎల్ రాహుల్‌తోపాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సతీమణి మేహతో కలిసి ఆలయంలో శివ దర్శనం చేసుకున్న అక్షర్.. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ‘భస్మ హారతి’లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు.

పూజల అనంతరం మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. తాను 5 సంవత్సరాల క్రితం కూడా సందర్శించానని, అయితే అప్పుడు భస్మ హారతికి హాజరు కాలేకపోయానని పటేల్ చెప్పారు. ఈరోజు ఆ కోరిక నెరవేరిందన్నారు. భస్మ హారతిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.


అంతకుముందు రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ తన భార్య అతియా శెట్టితో కలిసి ఉజ్జయిని చేరుకుని అక్కడ బాబా మహాకాల్‌ను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాహానంతరం తొలిసారిగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు అథియా శెట్టి బాబా మహాకాల్‌ను దర్శించుకున్నారని ఆలయ పూజారి ఆశిష్ పూజారి తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జట్టుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఇక టీమిండియాలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లుగానే ఉంది. ఒక్కొక్క ఆటగాడే వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒకింటి వారయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా చేరాడు. మిట్టలి పారూల్కర్‌ను ఠాకూర్ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం