IND vs NZ: న్యూజిలాండ్‌కు దెబ్బ మీద దెబ్బ..కీవీస్‌‌కు వరుస షాక్‌లు.!

|

Oct 15, 2024 | 3:41 PM

న్యూజిలాండ్ రైట్ ఆర్మ్ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం కారణంగా భారత్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్ ఇటీవల శ్రీలంక పర్యటన సందర్భంగా ఎడమ మోకాలికి నొప్పి రావడంతో సియర్స్ భారత్‌కు రావడం ఆలస్యమైంది. అతను ఆడటానికి క్లియర్ అవుతాడనే ఆశతో వైద్యులతో చికిత్స కూడా తీసుకున్నాడు. “అయితే, వైద్య సలహాను అనుసరించి, అతనిని సిరీస్ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.

IND vs NZ: న్యూజిలాండ్‌కు దెబ్బ మీద దెబ్బ..కీవీస్‌‌కు వరుస షాక్‌లు.!
Ben Sears
Follow us on

న్యూజిలాండ్ రైట్ ఆర్మ్ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం కారణంగా భారత్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్ ఇటీవల శ్రీలంక పర్యటన సందర్భంగా ఎడమ మోకాలికి నొప్పి రావడంతో సియర్స్ భారత్‌కు రావడం ఆలస్యమైంది. అతను ఆడటానికి క్లియర్ అవుతాడనే ఆశతో వైద్యులతో చికిత్స కూడా తీసుకున్నాడు. “అయితే, వైద్య సలహాను అనుసరించి, అతనిని సిరీస్ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.

అతని స్థానంలో జాకబ్ డఫీని తీసుకున్నారు. అన్‌క్యాప్ చేయని 30 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బుధవారం భారతదేశానికి బయలుదేరనున్నారు. డఫీ ఇప్పటివరకు కివీస్ తరఫున ఆరు వన్డేలు. 14 టీ20లు ఆడాడు. 102 ఫస్ట్ క్లాస్ ఔటింగ్‌లలో 299 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. “స్వదేశీ వేసవిలో తన టెస్ట్ కెరీర్‌ను బలంగా ప్రారంభించినా బెన్ గాయం కారణంగా భారత్ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడం నిరాశకు గురి చేసే విషయమన్నారు.

జాకబ్ ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ఆడిన అనుభవం ఉందని, బ్లాక్‌క్యాప్‌ల కోసం వైట్-బాల్ క్రికెట్‌లో అతని ప్రదర్శనలు ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయని, జట్టు విజయానికి అతడు కృషి చేస్తాడని ఆశిస్తున్నట్లు స్టెడ్ పేర్కొన్నారు. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా మొదటి టెస్టు ఆడటం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి