ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం..ఈ మ్యాచ్ గెలిస్తే మూడవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లోకి వెళ్లే దారులు తెరుచుకుంటాయి. ఇంకా ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్‌లో 3 గెలవాలి. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ రెండు జట్లు 2021లో ఈ మైదానంలో తలపడ్డాయి.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్ (w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే