IND vs SA: వాండరర్స్‌లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎ అయిన వీడియో..

|

Jan 01, 2022 | 4:50 PM

దక్షిణాఫ్రికాతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతోన్నారు. భారత ఆటగాళ్లు జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో చెమటోడ్చారు...

IND vs SA: వాండరర్స్‌లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎ అయిన వీడియో..
Kohli
Follow us on

దక్షిణాఫ్రికాతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతోన్నారు. భారత ఆటగాళ్లు జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో చెమటోడ్చారు. సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‎లో ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ప్పుడు సౌతాఫ్రికాలో రెడ్-బాల్ ఫార్మాట్‌లో తమ తొలి సిరీస్ సాధించాలని చూస్తోంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం వాండరర్స్‌లో జట్టు శిక్షణకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. మొదటి టెస్ట్‌లో భారత్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్ విజయానికి ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. మొదటి మ్యాచ్‎లో ఫాస్ట్ బౌలర్ల ఆట తీరును కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్లలో ఒక్కడైన మహ్మద్ షమీని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఎనిమిది వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో షమీ గురించి కోహ్లీ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ముగ్గురు సీమర్లలో షమీ ఒక్కడు. బలమైన మణికట్టు, అతని సీమ్ పొజిషన్, లెంగ్త్‌ అతని సొంతం.” అని అతను చెప్పాడు.

వాండరర్స్‌లో ఆడిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాదాపుగా మ్యాచ్ రద్దుకు దారితీసిన ప్రమాదకరమైన పిచ్‌పై, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్, అతని డిప్యూటీ అజింక్యా రహానే ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపారు. రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా 177 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ ఐదు వికెట్లతో రాణించాడు.

Read Also.. Ravi Shastri: అలా చేస్తే ఓడిపోవచ్చు.. కానీ గెలిస్తే అద్భుతమే.. గబ్బా విజయంపై రవి శాస్త్రి..