Jasprit Bumrah: అడ్డంగా బుక్కైన జస్ప్రీత్ బుమ్రా.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. కారణమిదే.!

Jasprit Bumrah Marriage: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదేంటి బుమ్రాకు రీసెంట్‌గా పెళ్లి అయింది కదా.!..

Jasprit Bumrah: అడ్డంగా బుక్కైన జస్ప్రీత్ బుమ్రా.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. కారణమిదే.!
Bumrah

Updated on: Mar 20, 2021 | 5:37 PM

Jasprit Bumrah Marriage: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదేంటి బుమ్రాకు రీసెంట్‌గా పెళ్లి అయింది కదా.! దేని గురించి విమర్శిస్తున్నారని అనుకోవచ్చు. అందుకు కారణం లేకపోలేదు. బుమ్రా పెళ్లి ఫోటోలపైనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదెందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నెల 15వ తేదీన స్పోర్ట్స్ రిపోర్టర్ సంజనా గణేషన్‌తో బుమ్రా వివాహమైన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక గోవాలో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇక పెళ్లి తర్వాత బుమ్రా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

”గత కొన్ని రోజులుగా నా జీవితం అద్భుతంగా ఉంది. మీరు చూపించే ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు” అని పేర్కొంటూ బుమ్రా తన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. బుమ్రా షేర్ చేసిన ఈ ఫోటోలే అభిమానులకు ఆగ్రహాన్ని తెచ్చాయి. ఎందుకంటే గతంలో దీపావళి రోజున బుమ్రా ‘టపాసులు కాల్చొద్దు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. 2017లో అతడు చేసిన ఈ ట్వీట్‌ను అభిమానులు రీ-ట్వీట్ చేస్తూ బుమ్రాపై మండిపడుతున్నారు. ”బ్రో. మొదట మీరు పాటించండి. ఆ తర్వాత వేరేవాళ్లకు చెప్పండి” అని నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

బుమ్రా పెళ్లి ఫోటోలు…

నెటిజన్ల కామెంట్స్ ఇవే…

Loading...
Unable to load recommendations.
Follow Us