DC vs MI Match Report: W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్.. ఢిల్లీ తొలి ఓటమి

ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 19వ ఓవర్లో, ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లను రనౌట్ చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఓవర్‌లో అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మలు ఔటయ్యారు.

DC vs MI Match Report: W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్.. ఢిల్లీ తొలి ఓటమి
Delhi Capitals Vs Mumbai Indians Match Result

Updated on: Apr 13, 2025 | 11:36 PM

DC vs MI Match Report: ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 19వ ఓవర్లో, ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లను రనౌట్ చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఓవర్‌లో అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మలు ఔటయ్యారు. దీంతో ముంబై ఫేట్‌ కేవలం 3 బంతుల్లో మారిపోయింది. ఈ క్రమంలో ముంబై జట్టు వరుస రెండు ఓటముల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది.

ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు.

19వ ఓవర్లో 3 రన్‌ ఔట్స్..

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం. ఇక్కడ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. బుమ్రా విసిరిన ఈ ఓవర్లో అశుతోష్ శర్మ తొలి 3 బంతుల్లో 2 ఫోర్లు కొట్టాడు. నాలుగో బంతికి అశుతోష్ రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.

5వ బంతికి కుల్దీప్ యాదవ్ 2 పరుగులు తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అతను కూడా రనౌట్ అయ్యాడు. చివరి బంతికి మోహిత్ శర్మ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ, మిచెల్ సాంట్నర్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌట్ అయ్యాడు.

19వ ఓవర్లో ఢిల్లీ 10 పరుగులు చేసింది. కానీ ఢిల్లీ జట్టు 12 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ముంబై తరపున కర్ణ్ శర్మ 3 వికెట్లు, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..