Mumbai Indians retained players 2025: ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలానికి ముందు రోహిత్ శర్మను రిటైన్ చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది. ముంబైకి ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్, టోర్నమెంట్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఎంఎస్ ధోనితో పాటు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.
రోహిత్ తన పదవీకాలంలో IPL, ఛాంపియన్స్ లీగ్ T20 అంతటా 163 మ్యాచ్‌లలో ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. 4 టైలు, 68 ఓటములతోపాటు 91 విజయాలు సాధించాడు. రోహిత్ నాయకత్వంలో, ముంబై ఐదు IPL ఫైనల్స్‌కు చేరుకుని(2013, 2015, 2017, 2019, 2020), విజేతగా నిలిచింది.
ఈ ఏడాది ప్రారంభంలో బార్బడోస్‌లో జరిగిన రెండో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ నాయకత్వం వహించి, విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.
10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. 2025 సీజన్ మెగా వేలానికి ముందు ప్రతి జట్టు గరిష్టంగా ఐదుగురు అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించింది.
1. జస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు)
2. సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు)
3. హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు)
4. రోహిత్ శర్మ (రూ. 16.3 కోట్లు)
5. తిలక్ వర్మ (రూ. 8 కోట్లు).
𝐎𝐔𝐑 𝔼𝕃𝔼𝕄𝔼ℕ𝕋𝕊. 𝐎𝐔𝐑 ℂ𝕆ℝ𝔼. 𝐎𝐔𝐑 ℝ𝔼𝕋𝔼ℕ𝕋𝕀𝕆ℕ𝕊 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/2nlhU6gNOF
— Mumbai Indians (@mipaltan) October 31, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..