MS Dhoni: రిటైరయ్యి మూడేళ్లు.. క్రేజ్‌ మాత్రం తగ్గలే.. ధోని నామస్మరణతో మార్మోగిన మైదానం.. వీడియో వైరల్‌

|

Jan 28, 2023 | 6:46 PM

మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు రాంచీకి రోజు కూడా ఎంఎస్ ధోని ఆకస్మికంగా స్టేడియంను సందర్శించాడు ధోని. అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు. కెప్టెన్ హార్దిక్, ఇషాన్ కిషన్, శివమ్ మావి, వాషింగ్టన్ సుందర్ తదిరులతో కలిసి చాలాసేపు గడిపాడు.

MS Dhoni: రిటైరయ్యి మూడేళ్లు.. క్రేజ్‌ మాత్రం తగ్గలే.. ధోని నామస్మరణతో మార్మోగిన మైదానం.. వీడియో వైరల్‌
Ms Dhoni
Follow us on

రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. మొదట బౌలింగ్‌ విభాగం, ఆ తర్వాత బ్యాటింగ్‌లో నిరాశపర్చిన టీమిండియా 21పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా తన సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ధోని హాజరయ్యాడు. తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇక మ్యాచ్‌ సందర్భంగా ధోని స్క్రీన్‌పై కనబడగానే స్టేడియం మొత్తం ధోని.. ధోని అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. ఈక్రమంలో ధోనీ ధోనీ అంటూ అభిమానులు నిన‌దిస్తుండ‌గా అత‌ను కూడా స్పందించాడు. చిరునవ్వు చిందిస్తూ చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌మ అధికారిక ట్వి్ట్టర్‌ ఖాతాలోషేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు రాంచీకి రోజు కూడా ఎంఎస్ ధోని ఆకస్మికంగా స్టేడియంను సందర్శించాడు ధోని. అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు. కెప్టెన్ హార్దిక్, ఇషాన్ కిషన్, శివమ్ మావి, వాషింగ్టన్ సుందర్ తదిరులతో కలిసి చాలాసేపు గడిపాడు. కాగా రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం ధోనీకి హోమ్ గ్రౌండ్. అతను తరచుగా ఇక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ 16వ ఎడిషన్ కోసం కసరత్తులు ప్రారంభించాడు.

ఇక శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (52), డెరల్ మిచెల్ (59) హాఫ్ సెంచరీల సాయంతో న్యూజిలాండ్ 176 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 35, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ తలో వికెట్ తీశారు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21), సూర్యకుమార్ యాదవ్ (47) ఆశలు రేకెత్తించినా టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 50 పరుగులు చేసినా.. ఇతర బ్యాటర్లు అతనికి సహకారం ఇవ్వలేదు. చివరికి భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకంజలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం (జనవరి 29) జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..