
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నారు. మహీ ఎక్కడకు వెళ్లినా అభిమానులు ఆయనను ఫాలో అవుతుంటారు. అయినా ధోనీ ఇబ్బంది పడకుండా వారితో సరదాగా మాట్లాడుతుంటారు. ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో ధోని తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్నారు. ఆయన స్నేహితుడు కారు నడుపుతుండగా, ధోనీ పక్కన కూర్చున్నారు. మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్‌ను రాంచీకి ఎటు వెళ్లాలి? అంటూ ధోని అడిగారు. ఒక్కసారిగా ధోనీ అలా రోడ్డుమీద కారులో ప్రత్యక్షమవడం, తనని అడ్రస్ అడగడంతో ఆ అభిమాని ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది, దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది అని అభిమాని చెప్పాడు. అది విగ్రహం ఉన్న సర్కిలేనా? అంటూ ధోనీ తను వెళ్లాల్సిన దారిని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో ధోనీ సెల్ఫీ దిగి ముందుకెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
This man is so simple and this simplicity is what makes him different from every other celebrity #MSDhoni #Dhoni pic.twitter.com/ErMlX3KGVX
— TAAGASTYA (@LalPatrakar) August 11, 2023
2005లో టెస్టుల్లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన ధోని.. మొత్తం 90 మ్యాచ్‌లలో 33 అర్ధ సెంచరీలు, 6 శతకాలు, ఒక డబుల్ సెంచరీతో 4876 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లోకి 2004లో అరంగేట్రం చేసి.. 73 అర్ధ సెంచరీలు, 10 సెంచరీలతో 10,773 పరుగులు, 2006లో టీ20 డెబ్యూ చేసి.. 2 అర్ధ సెంచరీలతో 1617 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 5082 పరుగులు చేసిన ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదుసార్లు ట్రోఫీ అందించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..