MS Dhoni Quits CSK Captaincy: ధోనీ కెరీర్‌లో 3 వివాదాలు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచమే షాక్.. అవేంటంటే?

|

Mar 24, 2022 | 5:34 PM

Dhoni resigns as Chennai Super Kings Captain in IPL 2022: మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజా సీఎస్‌కే కొత్త సారథిగా మారాడు.

MS Dhoni Quits CSK Captaincy: ధోనీ కెరీర్‌లో 3 వివాదాలు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచమే షాక్.. అవేంటంటే?
Ipl 2022 Ms Dhoni, Csk
Follow us on

ఎంఎస్ ధోనీ(MS Dhoni)… అతని నాయకత్వం కారణంగా ప్రపంచానికి తానెంటో చూపించాడు. క్లిష్ట సమయాల్లో ఓపికతో, సంయమనంతో పనిచేసి తన జట్టును గెలిపించిన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. మొత్తానికి ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి కూడా ధోని తప్పుకున్నాడు. ఐపీఎల్ 20222 (IPL 2022) 15వ సీజన్ ప్రారంభానికి ముందు , ధోని (MS Dhoni Quits CSK Captaincy) చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ధోనీ ప్రస్తుతం వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రవీంద్ర జడేజాను చెన్నై కొత్త సారథిగా ఎంచుకున్నారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్ శకం ముగిసింది. తన కెప్టెన్సీలో చెన్నైని నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చిన ధోనీ, చెన్నైకి రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన ధోనీ ప్రస్తుతం మైదానంలో సాధారణ ఆటగాడిగా కనిపించనున్నాడు.

ధోని తన కెప్టెన్సీలో చాలా సాధించాడు. కానీ, అతని IPL కెప్టెన్సీలో గత 3 సంవత్సరాలలో 3 వివాదాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అంపైర్‌లతో వాదించినా లేదా తన ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇలా ధోని నుంచి ఎవ్వరూ ఊహించని కనిపించాయి. కూల్ కెప్టెన్ ధోనీ మూడు పర్యాయాలు తన ప్రశాంతతను కోల్పోయాడు. ఆ 3 వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి వివాదం..

ఐపీఎల్ 2019లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ధోని డగౌట్ నుంచి మిడిల్ గ్రౌండ్‌కి వచ్చి అంపైర్లతో గొడవ ప్రారంభించాడు. చివరి ఓవర్‌లో చెన్నైకి 18 పరుగులు కావాలి. తొలి మూడు బంతుల్లో 10 పరుగులు చేసిన స్టోక్స్ నాలుగో బంతికి ఆశ్చర్యపరిచాడు. బెన్ స్టోక్స్ వేసిన నాల్గవ బంతి ఫుల్ టాస్, మిచెల్ సాంట్నర్ రెండు పరుగులు చేశాడు. దీంతో జడేజా, సాంట్నర్‌లు అంపైర్‌ను నో బాల్‌కు డిమాండ్ చేసినప్పటికీ అది జరగలేదు. జడేజా అంపైర్‌తో వాదించడం మొదలుపెట్టాడు. ఆపై కోపంతో, ధోని డగౌట్ నుంచి మైదానంలోకి ప్రవేశించాడు. అంపైర్లతో వాదించినా.. ధోనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అయితే చివరకు విజయం చెన్నైదే.

రెండో వివాదం..

ఐపీఎల్ 2020లో ధోనీ నోటి నుంచి వినకూడని మాటలు వినిపించాయి. ఇది బహుశా ఎవరూ ఊహించి ఉండరు. IPL 2020లో చెన్నై సూపర్ కింగ్స్ 7వ మ్యాచ్‌లో ఓడిపోయిన వెంటనే, ధోనీ తన జట్టులోని యువ ఆటగాళ్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. తొలి 10 మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచులో ఓడిపోవడంతో ధోనీ యువ ఆటగాళ్లపై కోపం ప్రదర్శించాడు.

మూడో వివాదం..

గత సీజన్‌లోనే ధోనీ మూడో వివాదం బయటకు వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో, శార్దూల్ ఠాకూర్ ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతిని అంపైర్ పాల్ రైఫిల్ వైడ్ ఇవ్వబోతుండగా, ధోని అకస్మాత్తుగా వికెట్ల వెనుక నుంచి అరిచాడు. దీని తర్వాత రైఫిల్ చేయి ఎత్తడం కూడా ఆగిపోయింది. అంపైర్ కూడా బంతిని వైడ్‌గా ప్రకటించలేదు.

Also Read: MS Dhoni Quits CSK Captaincy: 11 ఫ్లేఆఫ్స్.. 9 ఫైనల్స్.. 4 సార్లు ఛాంపియన్.. ధోనీ రికార్డులు చూస్తే వావ్ అనాల్సిందే..

MS Dhoni: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.!