చివరి ఓవర్ ఉత్కంఠలో మ్యాజిక్ చేసి చూపించాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్. ఈ సీన్ పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు చేసుకుంది. చివరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అతడెవరో కాదు డ్వేన్ ప్రిటోరియస్. అతడు గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని సారధ్యంలో ఆడిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ధోనికి నమ్మిన బంటుగా ఉన్న ప్రిటోరియస్.. ఇప్పుడు పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించాడు.
ఇటీవల క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి 6 బంతుల్లో కరాచీ కింగ్స్ విజయం సాధించాలంటే 8 పరుగులు చేయాల్సి ఉంది. స్కోర్ పెద్దగా లేకపోయినా ఫైట్ మాత్రం రసవత్తరంగా జరిగింది. కరాచీ కింగ్స్ యామిన్‌కు బౌలింగ్ అందజేసింది. మొదటి బంతికే గప్తిల్ వికెట్ దక్కింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్. ఆ సమయంలో క్వెట్టా జట్టు ఇంకా 7 పరుగులు చేయాల్సి ఉంది.
క్రీజులోకి దిగిన ప్రిటోరియస్ ఆడిన తొలి బంతికే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి 2 పరుగులు తీశాడు. ఇక 5వ బంతికి ఫోర్ కొట్టి క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలోనే ఛేదించింది క్వెట్టా గ్లాడియేటర్స్.
Jubilation in the Gladiators camp ? #SabSitarayHumaray l #QGvKK l #HBLPSL8 pic.twitter.com/wFVLVCtovK
— PakistanSuperLeague (@thePSLt20) March 6, 2023