‘ధోనీ ఉండటం మాకో వరం’: కోహ్లీ

| Edited By:

Jun 28, 2019 | 3:52 PM

ఐసీసీ ప్రపంచ కప్ 2019లో భాగంగా గత రెండు ఇన్నింగ్స్‌లో ధోనీ జోరు ప్రదర్శించకపోవడంపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. క్రీజులో ధోనీ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడని అతడిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే మాజీలు, సీనియర్ల మధ్య చర్చ జరిగింది.. కొందరు ధోనీకి మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ..ధోనీకి మద్దతుగా మాట్లాడాడు. టీమిండియా సారథిగా, వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని అందించిన సేవలు వెలకట్టలేనివని […]

ధోనీ ఉండటం మాకో వరం: కోహ్లీ
Follow us on

ఐసీసీ ప్రపంచ కప్ 2019లో భాగంగా గత రెండు ఇన్నింగ్స్‌లో ధోనీ జోరు ప్రదర్శించకపోవడంపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. క్రీజులో ధోనీ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడని అతడిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే మాజీలు, సీనియర్ల మధ్య చర్చ జరిగింది.. కొందరు ధోనీకి మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ..ధోనీకి మద్దతుగా మాట్లాడాడు. టీమిండియా సారథిగా, వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని అందించిన సేవలు వెలకట్టలేనివని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

‘ధోనీ జట్టులో ఉండటం మాకో వరం. ఆట పరిస్థితులును అర్థం చేసుకుని అతడిచ్చే సలహాలు అద్భుతంగా పనిచేస్తుంటాయి. మ్యాచ్‌ తర్వాత ఏ అభిమానీ, ఏ సీనియరు ఇవ్వలేని ఫీడ్‌ బ్యాక్‌ ధోనీ ఇస్తాడు. ఉదాహరణకు మ్యాచ్‌ గెలవడానికి 15-20 పరుగులు అవసరమవుతాయి అనుకుంటే..ఆ పరుగులు ఎలా రాబట్టాలో అతడికి బాగా తెలుసు. ఆ అంచనాకు కారణం అతడి అనుభవమే. వికెట్ల వెనక ఉండి మొత్తం మైదానాన్ని ధోనీ అధ్యయనం చేయగలడు. ధొని లెజెండ్‌. ఆ విషయం మాకు తెలుసు. ఆ నమ్మకాన్ని మేం అలాగే కొనసాగిస్తాం. ఇంకా చెప్పాలంటే తనదైన రోజున అందరూ ధోనీ గురించే మాట్లాడుకుంటారు. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా’ అని చెప్పుకొచ్చాడు.