AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి తండ్రి కాబోతున్న వార్నర్.. ఎమోషనల్ అయిన క్రికెటర్

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో 12నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న వార్నర్.. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు. ఆ మధ్య భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ సన్ రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కూడా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్ వార్నర్‌కు మరో శుభవార్త […]

మరోసారి తండ్రి కాబోతున్న వార్నర్.. ఎమోషనల్ అయిన క్రికెటర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2019 | 1:34 PM

Share

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో 12నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న వార్నర్.. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు. ఆ మధ్య భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ సన్ రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కూడా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్ వార్నర్‌కు మరో శుభవార్త సిద్ధంగా ఉంది. ఆయన భార్య క్యాండిస్ ఈ ఆదివారం మూడో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది.

దీనిపై తాజాగా స్పందించిన వార్నర్.. ‘‘నిషేధ సమయంలో నా భార్య క్యాండిస్‌కు రెండుసార్లు అబార్షన్ అయ్యింది. ఇప్పటికే నా ఒడిలో మరో బిడ్డ ఉండాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి కాబోతున్నా. ప్రస్తుతం నా ధ్యాసంతా క్రికెట్‌పైనే. మాకు ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలు ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆదివారం మా కుటుంబంలోకి మరొకరు రావచ్చు. ఆ శుభగడియల కోసం ఎదురుచూస్తున్నా’’ అని తెలిపాడు. కాగా వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Follow Us
ఇంట్లోనే ఈజీగా ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్..అదిరిపోయే రెసిపీ
ఇంట్లోనే ఈజీగా ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పులావ్..అదిరిపోయే రెసిపీ
అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!
అలర్ట్‌.. ఈ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకు..? ఎప్పుడంటే..!
జాతీయ అవార్డు విజేతలకు ఎన్టీఆర్ స్పెషల్ విషెస్..
జాతీయ అవార్డు విజేతలకు ఎన్టీఆర్ స్పెషల్ విషెస్..
ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌
ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌
తెలంగాణలో మళ్లీ భూలొల్లి.. మరో పొలిటికల్‌ సరుకు దొరికినట్టేనా?
తెలంగాణలో మళ్లీ భూలొల్లి.. మరో పొలిటికల్‌ సరుకు దొరికినట్టేనా?
మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర!
మహిళలకు పండగలాంటి వార్త.. రికార్డ్‌ స్థాయిలో తగ్గుతున్న వెండి ధర!
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు
సీబీఎస్సీ టెన్త్‌ సెకండ్‌ బోర్డు ఫలితాలు.. ఇలా తనిఖీ చేసుకోండి..!
సీబీఎస్సీ టెన్త్‌ సెకండ్‌ బోర్డు ఫలితాలు.. ఇలా తనిఖీ చేసుకోండి..!
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్..
వెచ్చని రక్తాన్ని పసిగట్టే పాము.. దీని వేటాడే స్టైలే వేరు!
వెచ్చని రక్తాన్ని పసిగట్టే పాము.. దీని వేటాడే స్టైలే వేరు!