Video: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంటది మరి.. ఏకంగా 100 అడుగుల కౌటౌట్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

|

Jul 07, 2024 | 11:27 AM

MS Dhoni Birthday Celebration Telugu Fans: ప్రతి సంవత్సరం, భారతదేశంలోని చాలా మంది క్రికెట్ అభిమానులకు జులై 7 చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇదే రోజున జన్మించాడు. ఎంఎస్ ధోనీకి నేటితో 43 ఏళ్లు. అభిమానులు ధోని పుట్టిన రోజును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈసారి కూడా అలాంటిదే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి క్రికెట్ అభిమాని ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Video: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంటది మరి.. ఏకంగా 100 అడుగుల కౌటౌట్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Ms Dhoni Birthday Celebration
Follow us on

MS Dhoni Birthday Celebration Telugu Fans: ప్రతి సంవత్సరం, భారతదేశంలోని చాలా మంది క్రికెట్ అభిమానులకు జులై 7 చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇదే రోజున జన్మించాడు. ఎంఎస్ ధోనీకి నేటితో 43 ఏళ్లు. అభిమానులు ధోని పుట్టిన రోజును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈసారి కూడా అలాంటిదే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి క్రికెట్ అభిమాని ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు.

ధోనీ పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిన తెలుగు ఫ్యాన్స్..

ఈ ఏడాది ధోనీ పుట్టిన రోజు వేడుకలను తెలుగు అభిమానులు కటౌట్లతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కటౌట్ 20, 30 అడుగులు కాడండోయ్.. ఏకంగా 100 అడుగుల ఎత్తు ఉంది. ఈ హై కటౌట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో ధోనీ కోసం 100 అడుగుల ఎత్తైన కటౌట్‌ను సిద్ధం చేశారు. ఆపై పటాకులు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది కూడా నందిగామలో ధోని అభిమానులు భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు.

అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా..

ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్ రూపంలో భారత్ తన మొదటి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత భారత్‌కు వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్స్‌ను అందించాడు. ధోనీ టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా 60 మ్యాచ్‌లు ఆడాడు. అందులో జట్టు 27 గెలిచింది. 18 ఓడిపోయింది. ఇది కాకుండా వన్డేల్లో టీమిండియాకు 200 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 72 మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా కెప్టెన్‌గా కూడా 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు..

2020లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు, ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో 2004 నుంచి 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 144 ఇన్నింగ్స్‌ల్లో 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇది కాకుండా, వన్డేల్లో 50.57 సగటుతో 10773 పరుగులు జోడించాడు. కాగా, టీ20 ఇంటర్నేషనల్‌లో, ధోనీ 37.60 సగటుతో 1617 పరుగులు, స్ట్రైక్ రేట్ 126.13 చేశాడు. ఈ కాలంలో అతను 6వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడుతూ 10000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇప్పటి వరకు మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ చేయలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..