Dhoni-Kohli: ధోని మైండ్‌తో కోహ్లీ ఆట.. ఇక మైదానంలో దబిడ దిబిడే అంటోన్న భారత మాజీ ఆటగాడు

|

Oct 13, 2021 | 8:40 PM

T20 World Cup: ధోనీ మైండ్‌తో కోహ్లీ మైదానంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయడం చూస్తే నిజంగా టీ20లో టీమిండియా విజయం ఖాయమే అంటున్నారు మాజీలు. అందులోనూ టీ 20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది చివరి ప్రపంచకప్ కావడంతో..

Dhoni-Kohli: ధోని మైండ్‌తో కోహ్లీ ఆట.. ఇక మైదానంలో దబిడ దిబిడే అంటోన్న భారత మాజీ ఆటగాడు
T20 World Cup Dhoni And Kohli
Follow us on

T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అన్ని జట్లు యూఏఈలో సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ ఆడుతున్నందున భారత జట్టు సభ్యులంతా అక్కడే ఉన్నారు. ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) టీ20 కప్ కోసం టీమిండియా వ్యూహాన్ని సిద్ధం చేయడం ప్రారంభించే పనిలో నిమగ్నమవుతాడు. అంటే ఈ సారి ధోని మైండ్‌తో విరాట్ కోహ్లీ మైదానంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నాడు. టీ 20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది చివరి ప్రపంచకప్. ఆ కోణంలోనైనా విరాట్ కోహ్లీ కచ్చితంగా పొట్టి కప్‌ను గెలవాలని కోరుకుంటాడు. ఈ ప్రచారంలో ధోనీ అతనికి మద్దతు ఇస్తాడు. అంటే, మొత్తం మూడు పెద్ద ఐసీసీ టైటిళ్లను దక్కించుకున్న కెప్టెన్లలో ప్రపంచంలో ఒకే ఒక్కడు ధోనినే కావడంతో.. ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ ఇద్దరి దిగ్గజాల సూపర్ ప్లాన్‌తో టీమిండియా కప్‌ కోసం బరిలోకి దిగనుంది.

టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోని మెంటార్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రతిపాదించిన ఈ చర్యను ఎంఎస్‌కే ప్రసాద్ ప్రశంసించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. ఈ నిర్ణయం తప్పనిసరిగా అందరి సమ్మతితో తీసుకునే ఉంటారు. 200 కంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్‌లను గెలిచిన అనుభవం ఉన్న ఆటగాడు టీమిండియాకు మెంటార్‌గా పనిచేయడం ఎంతో కీలకం కానుంది. నేను ఈ నిర్ణయాన్ని గౌరవిస్తాను. చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు మెంటర్‌గా మారడానికి ధోనీ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని’ ఆయన అన్నారు.

ధోనీ ‘మైండ్’తో విరాట్ ఆట
“ధోని, శాస్త్రితో విరాట్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ ముగ్గురికి ఇది గొప్ప టోర్నమెంట్. ధోని కెప్టెన్సీలో విరాట్ చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అదే సమయంలో శాస్త్రితో కోహ్లీ ఎంతో చక్కగా సమన్వయం చేసుకోగలడు. ఎంఎస్‌కే ప్రసాద్ ధోని ప్రత్యేకత గురించి నొక్కిచెప్పారు. “అతని ఆలోచనలు ఎంతో పదునుగా ఉంటాయి. క్రికెట్‌పై మంచి అవగాహన ఉంది. ఎప్పుడు, ఏ పరిస్థితిలో ఏం చేయాలో ధోనికి తెలుసు. ధోని జట్టుతో చేరడం ఖచ్చితంగా టీం బలాన్ని పెంచుతుంది. దీంతో విరాట్ కోహ్లీ పని కూడా చాలా తేలికగా మారుతుందని’ పేర్కొన్నాడు.

టీ 20 వరల్డ్ కప్‌లో ధోనీ టీమిండియా వ్యూహాలలో భాగం అవుతాడు. దీని కంటే గొప్పది మరొకటి ఉండదు. ఖచ్చితంగా ధోని- విరాట్ జోడీ కలిసి మైదానంలో అద్భుతాలు చేసేందుకు అవకాశం ఉంది.

Also Read: Team India Coach: రవిశాస్త్రి స్థానంలో వచ్చేది ఆయనేనా? న్యూజిలాండ్ సిరీస్‌ కంటే ముందే అఫిషీయల్ ప్రకటన

IPL 2021: ఆర్‌సీబీ బౌలర్‌, ఆయన భార్యపై కోహ్లీ అభిమానుల నీచమైన కామెంట్లు.. పనికిరాని వాళ్లంటూ మ్యాక్స్‌వెల్ వార్నింగ్