Morne Morkel: రోహిత్‌‌ను ప్రశంసించిన బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్.. ఏమన్నారంటే?

| Edited By: Janardhan Veluru

Oct 01, 2024 | 5:53 PM

కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మను బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క టెస్ట్ మ్యాచ్‌ను టీ20లా మార్చడం అంతా ఈజీ కాదన్నారు.

Morne Morkel: రోహిత్‌‌ను ప్రశంసించిన బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్.. ఏమన్నారంటే?
Morne Morkel Praises Rohit
Follow us on

టీమిండియా కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలి మూడు రోజులు వర్షం కారణంగా నిరాశలో ఉన్నా క్రికెట్ అభిమానులకు కిక్కు ఇచ్చేలా టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టాడు. మొదటి నుంచి సంచలన నిర్ణయాలతో టీమిండియా అందరీ దృష్టిని ఆకర్షించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని రోహిత్ సేన సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారత్ 4వ రోజు 285/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవడం కోసం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. రిస్క్ తీసుకొని మ్యాచ్‌ను టీమిండియా ఆటగాళ్లు గెలిపించారు. ఇక టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ ఊచకోతే అని చెప్పాలి. కేఎల్ రాహుల్, విరాట్, జైశ్వల్ అద్భుతంగా ఆడారు.

కాగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మను బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్‌ను టీ20లా మార్చడం అంతా ఈజీ కాదన్నారు. అలా మర్చాలంటే చాలా రిస్క్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోహిత్ నాయకుడిగా అద్భుతంగా లీడ్ చేసినట్లు కొనియాడారు. నాయకుడు అనే వాడు ముందు ఉండి నడిపించాలని, దానికి రోహిత్ సెట్ అవుతాడన్నారు.

తాము గౌతమ్ గంభీర్ మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ దాన్ని నడిపించడానికి సరైన నాయకుడు అవసరమన్నారు. అలా రోహిత్ టీమ్‌ను లీడ్ చేస్తాడని ప్రశంసించారు. తన తొలి బంతినే రోహిత్ సిక్స్ బాదినట్లు చెప్పారు. ఫాస్ట్ బంతికే షాట్ ఆడడం చాలా డేంజర్ అయిన రోహిత్ దూకుడితో ఆడాడని చెప్పారు. ఓపెనర్లు చాలా బాగా ఆడినట్లు చెప్పారు. దూకుడిగా ఆడాలంటే ముందు కెప్టెన్ దూకుడిగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. రోహిత్ ఆటలో దూకుడిని కొనిసాగించి టీమ్‌ను లీడ్ చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది రోహిత్ ఫిట్‌గా లేడని కామెంట్స్ చేస్తున్నారని, కానీ వాటిని రోహిత్ అస్సలు పట్టించుకోడన్నారు. రోహిత్ ఎప్పుడు జిమ్‌లో శ్రమిస్తాడన్నారు. గంభీర్‌‌తో పాటు రోహిత్ సఫలమైనట్లు చెప్పారు. రోహిత్‌కు టీమ్‌ను లీడ్ చేసే సత్తా ఉందని ప్రశంసించారు. గంభీర్ ప్లాన్‌ను సమర్థవంతంగా రోహిత్ అమలు చేసినట్లు చెప్పారు.