ఆ దరిద్రం పోయిందిరా సామీ.. 2027 ఆసియా కప్‌నకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్..!

Asia Cup 2027: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి ఇష్టపడలేదు. అంతకుముందు మెన్స్ టీం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇకపై ఈ సమస్య తీరనున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..!

ఆ దరిద్రం పోయిందిరా సామీ.. 2027 ఆసియా కప్‌నకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్..!
Asia Cup 2027

Updated on: Sep 15, 2026 | 3:04 PM

Mohsin Naqvis ACC Tenure Ends: టీమిండియా ఆసియా కప్ గెలవడం, మొహిసిన్ నక్వి ట్రోఫీ ఎత్తుకుని పారిపోవడం.. ఇప్పటి వరకు ఇదే జరిగింది. అయితే, 2027 నుంచి ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరకనుంది. ఈ మేరకు ఇప్పటి వరకు గెలిచిన ట్రోఫీలతోపాటు 2027 ట్రోఫీ గెలిచినా, ఇక టీమిండియాకు దక్కకుండా అడ్డుకోడం ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలా ఎందుకు అంటున్నామని షాక్ అవుతున్నారు. అవును, అందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహిసిన్ నక్వి పదవీకాలం త్వరలో ముగిసిపోనుంది. దీంతో దరిద్రం పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపై మన ట్రోఫీ మన చెంతే అంటూ సంబరపడిపోతున్నారు. తాజాగా మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత జట్టు గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ మంత్రి, (ఏసీసీ) అధ్యక్షుడు వేదికపై ప్రత్యక్షం కావడంతో మరోసారి ఈ వివాదం వెలుగుచూసింది. శ్రీలంక జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు రికార్డు స్థాయిలో 8వసారి టైటిల్‌ కైవసం చేసుకుంది. అయితే, బహుమతి ప్రధానోత్సవంలో మొహిసిన్ నక్వి ట్రోఫీని అందించడానికి వేదికపై సిద్ధంగా ఉన్నాడు. కానీ, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సహా ఏ ఒక్క భారత క్రికెటర్ కూడా మొహిసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి అంగీకరించలేదు. దీంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే మైదానంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు.

ఈ సంఘటన మొదటిసారి కాదనే సంగతి తెలిసిందే. గతేడాది మెన్స్ ఆసియా కప్‌లోనూ సేమ్ సీన్ రిపీటైంది. భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచినప్పుడు కూడా, అప్పటి ఏసీసీ చైర్మన్‌గా ఉన్న మొహిసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి భారత ఆటగాళ్లు ఆసక్తి చూపలేదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగానే క్రీడాకారులు ఈ విధంగా ట్రోఫీలను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు మొహిసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోలేదు.

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

ఇవి కూడా చదవండి

ఈ పరిణామాల నేపథ్యంలో, వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ గురించిన చర్చ మొదలైంది. బంగ్లాదేశ్‌తో మరో వివాదం కారణంగా టీమ్ ఇండియా అక్కడికి వెళ్తుందో లేదో స్పష్టత లేదు. అయితే, ఒకవేళ టీమిండియా ఆసియా కప్‌లో పాల్గొని, టైటిల్ విజేతగా నిలిస్తే, మరోసారి మొహిసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి వస్తుందా అనే సందేహాలు తలెత్తాయి.

ఈ సందేహాలకు తెరదించుతూ ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్, ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మొహిసిన్ నక్వి పదవీకాలం 2027 ఏప్రిల్ నాటికి ముగియనుంది. అతని రెండేళ్ల పదవీకాలాన్ని పొడిగించే అవకాశం లేదని సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌లో జరగనున్న మెన్స్ ఆసియా కప్ టోర్నీకల్లా అతని పదవి ముగిసిపోతుంది.

ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం, అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో కొనసాగుతుంది. ప్రధాన సభ్య దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ చైర్మన్ పదవి మారుతూ ఉంటుంది. ప్రతి రెండేళ్లకోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఈ నియామకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, మొహిసిన్ నక్వి పదవీకాలం ఏప్రిల్ 2027లో ముగిసిన తర్వాత, కొత్త చైర్మన్ వస్తారు. దీంతో, రాబోయే ఆసియా కప్‌లు, ముఖ్యంగా 2027 ఆసియా కప్ నాటికి, భారత క్రికెటర్లు తాము ఇబ్బంది పడుతున్న వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఇది టీమ్ ఇండియాకు, అభిమానులకు ఒక శుభవార్తగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us