Mohammed Siraj
IND vs SL, Asia Cup 2023 Final: వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే సమయం మిగిలి ఉన్న వేళ భారత్ ప్రపంచానికి భారీ హెచ్చరిక ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంతో పాటు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కనబర్చిన ఈ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ విజయంలో మహ్మద్ సిరాజ్‌దే క్రెడిట్ మొత్తం. వేసిన 7 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి, 6 వికెట్లను పడగొట్టాడు. అంతకముందు బూమ్రా ఓ వికెట్.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మిగిలిన 3 వికెట్లు తీయడంతో లంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఆపై 51 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(23*), శుభమాన్ గిల్(27*) టార్గెట్‌ని 6.1 ఓవర్లలోనే సునాయాసంగా చేధించారు. అయితే నిప్పు లేకుండానే లంకకు మంట పెట్టిన సిరాజ్ తాను తీసిన 6 వికెట్లతోనే 10 రికార్డులు సృష్టించాడు. వాటిపై ఓ లుక్ వేద్దాం.
- 16 బంతుల్లోనే 5 వికెట్లు: లంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు.
- చమిందా వాస్ రికార్డ్ సమం: లంకపై 16 బంతుల్లో 5 వికెట్లు తీసి సిరాజ్.. శ్రీలంక మాజీ చమిందా వాస్ రికార్డ్‌ను సమం చేశాడు. వాస్ 2003లో బంగ్లాదేశ్‌పై బంతుల్లోనే 5 వికెట్లను తీశాడు.
- ఒకే ఓవర్‌లో 4 వికెట్లు: భారత్ తరఫున ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ క్రమంలో లసిత్ మలింగ రికార్డ్‌ను కూడా సిరాజ్ సమం చేశాడు. లసిత్ మలింగ్ కూడా 2007 వరల్డ్ కప్ సందర్భంగా సౌతాఫ్రికాపై ఒకే ఓవర్‌లో 4 వికెట్ల ప్రదర్శన చేశాడు.
- బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన: వన్డే క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన 4వ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), జస్ప్రీత్ బుమ్రా (6/19) ఉన్నారు.
- 50 వికెట్లు: లంకపై 6 వికెట్లతో చెలరేగిన సిరాజ్.. వన్డే క్రికెట్‌లో 50+ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో చేరాడు. సిరాజ్ 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
- 1002 బంతుల్లోనే 50 వికెట్లు: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పూర్తి చేసిన 2వ బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఈ ఫీట్ సాధించడానికి కేవలం 1002 బంతులు తీసుకోగా.. శ్రీలంక క్రికెటర్ అజంతా మెండిస్ (847 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు.
- ఆసియా కప్‌లో రెండు బౌలర్: ఆసియా కప్ చరిత్రలో 6 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ రికార్డ్ సృష్టించాడు. 2008లో శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ ఈ విధమైన ప్రదర్శన చేసి తొలి బౌలర్‌గా నిలిచాడు.
- 33 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్: శ్రీలంకపై 6 వికెట్ల అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో వకార్ యూనిస్ పేరిట ఉన్న రికార్డును సిరాజ్ బద్దలు కొట్టాడు. 1990లో పాకిస్థాన్ పేసర్ వకార్ యూనిస్ 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 21 పరుగులకే 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
- ఫైనల్‌లో మించింగ్: వన్డే క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా, ప్రపంచంలో 3వ బౌలర్ సిరాజ్ అవతరించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ ప్లేయర్ అఖిబ్ జావేద్ (7/37) అగ్రస్థానంలో ఉన్నాడు.
- నెహ్రా రికార్డ్ సమం: ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నెహ్రా పేరిట ఉన్న రికార్డ్‌ను కూడా సిరాజ్ సమం చేశాడు. మూడు ఫైనల్స్ ఆడిన నెహ్రా 6 వికెట్లు తీయగా.. తాను ఆడిన తొలి ఆసియా కప్ ఫైనల్‌లోనే సిరాజ్ ఈ ఘనత సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..