Asia Cup 2025 : శుభ్‌మన్ గిల్, సిరాజ్‌కు షాక్.. ఆసియా కప్ టీమ్ నుంచి ఆ ఇద్దరూ అవుట్.. చిత్రమైన ప్లేయింగ్ XI ఇదే!

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏషియా కప్ 2025 సమరం సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో ఏషియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేశాడు.

Asia Cup 2025 : శుభ్‌మన్ గిల్, సిరాజ్‌కు షాక్.. ఆసియా కప్ టీమ్ నుంచి ఆ ఇద్దరూ అవుట్.. చిత్రమైన ప్లేయింగ్  XI ఇదే!
Mohammed Kaif

Updated on: Aug 16, 2025 | 6:06 PM

Asia Cup 2025 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్, ఆసియా కప్ కోసం తన 15 మంది సభ్యుల జట్టును సెలక్ట్ చేశాడు. అయితే, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్లను కైఫ్ తన జట్టులో చేర్చుకున్నప్పటికీ ప్లేయింగ్ XI నుంచి మాత్రం వారిని పక్కన పెట్టడం ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

కైఫ్ తన సెలక్షన్‎తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్లుగా ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించిన గిల్, సిరాజ్‌ను కాకుండా సంజు సామ్సన్, అభిషేక్ శర్మలకు అవకాశం ఇచ్చాడు. మూడో స్థానంలో యువ సంచలనం తిలక్ వర్మను ఎంచుకున్నాడు. జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‎ను సెలక్ట్ చేశాడు. అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని సూచించాడు.

ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను ఎంపిక చేసుకున్న కైఫ్, స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‎లను తీసుకున్నాడు. పేస్ దళం బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు అప్పగించాడు. కైఫ్ ఎంపిక చేసిన ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేర్లు లేకపోవడం గమనార్హం.

కైఫ్ 15 మంది సభ్యుల జట్టులో ఉన్నవారు వీరే

ప్లేయింగ్-11: సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

రిజర్వ్ ఆటగాళ్లు: వరుణ్ చక్రవర్తి, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ.

భారత జట్టు మ్యాచ్ షెడ్యూల్

ఏషియా కప్‌లో భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..