IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..!

Mohammed Kaif on IND vs SL Test Draw: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగియడంపై మహమ్మద్ కైఫ్ స్పందించారు. విరాట్ కోహ్లీ ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదో రోజు భారత బౌలర్లు సరిగా ప్రయత్నించలేదని, కోహ్లీ ఉంటే యువ ఆటగాళ్లను అప్రమత్తంగా ఉంచేవాడని కైఫ్ విశ్లేషించారు. సోనాల్ దినుష పోరాటంతో శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకుంది.

IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..!
Mohammed Kaif On Ind Vs Sl Test Draw

Updated on: Aug 30, 2026 | 8:07 AM

Mohammed Kaif on IND vs SL Test Draw: భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ, రెండో టెస్ట్ డ్రాగా ముగియడం చర్చనీయాంశంగా మారింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సులువుగా గెలుస్తుందని అంతా భావించినా, సోనాల్ దినుష అద్భుత పోరాటంతో శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో టీమిండియా 2-0 క్లీన్ స్వీప్ ఆశలు సన్నగిల్లాయి.

ఈ టెస్ట్ ఫలితంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ గనుక ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదని కైఫ్ పేర్కొన్నారు. భారతకోహ్లీ తన వ్యూహంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టేవాడని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్ సుదీర్ఘమైన ఫార్మాట్ అని, దీనికి నిరంతర కృషి అవసరమని కైఫ్ గుర్తుచేశారు.

ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..!

ఇవి కూడా చదవండి

రెండో టెస్టులో ఐదో రోజు భారత జట్టు మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించిందని కైఫ్ విశ్లేషించారు. పిచ్ తిరుగుతోంది కాబట్టి వికెట్లు వాటంతట అవే పడతాయనే ధోరణిలో బౌలింగ్ చేశారే తప్ప, వికెట్లు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించలేదని ఆయన అన్నారు. ఒకవేళ కోహ్లీ జట్టులో ఉండి ఉంటే, నిరంతరం అరుస్తూ యువ ఆటగాళ్లను అప్రమత్తంగా ఉంచేవాడని, సోనాల్ దినుష వంటి బ్యాట్స్‌మెన్‌ను తన దూకుడు మాటలతో ఒత్తిడిలోకి నెట్టేవాడని కైఫ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దినుష వికెట్ తీయలేకపోవడంపై కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us