Mohammad Hafeez Retire: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్‌రౌండర్.. 41 ఏళ్లకు ఆటకు దూరమైన మాజీ కెప్టెన్

|

Jan 03, 2022 | 11:16 AM

Pakistan Cricket Team: మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ కెరీర్ 18 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ సమయంలో అతను మూడు ఫార్మాట్లలో చాలా విజయాలు సాధించాడు. పాకిస్థాన్ తరపున విజయవంతమైన..

Mohammad Hafeez Retire: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్‌రౌండర్.. 41 ఏళ్లకు ఆటకు దూరమైన మాజీ కెప్టెన్
Mohammad Hafeez
Follow us on

Mohammad Hafeez: పాకిస్థాన్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. జనవరి 3న విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ కెరీర్ 18 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ సమయంలో అతను మూడు ఫార్మాట్లలో చాలా విజయాలు సాధించాడు. పాకిస్థాన్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై అతని చివరి టోర్నమెంట్ 2021 టీ20 ప్రపంచ కప్‌గా నిలిచింది. ఇందులో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను చివరిసారిగా ఆడాడు.

ఏప్రిల్ 2003లో జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీని తర్వాత ఆగస్టు 2003లో టెస్ట్ అరంగేట్రం, ఆగస్టు 2006లో టీ20 అరంగేట్రం చేశాడు. మహ్మద్ హఫీజ్ 2018 డిసెంబర్‌లో చివరి టెస్టు, 2019 జూలైలో చివరి వన్డే, నవంబర్ 2021లో చివరి టీ20 ఆడాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 41 ఏళ్ల హఫీజ్ 218 వన్డేల్లో 11 సెంచరీల సాయంతో 6614 పరుగులు చేసి 139 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 55 టెస్టుల్లో 10 సెంచరీలతో 3652 పరుగులు చేసి 53 వికెట్లు పడగొట్టాడు. 119 టీ20 మ్యాచుల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు.

Also Read: Ashes Series 2021-22: సిడ్నీ టెస్ట్ ‘పింక్’ బాల్‌గా ఎందుకు మారిందో తెలుసా?

IND vs SA: విరాట్ కోహ్లీ సెంచరీ కరవు తీరేది అప్పుడే..: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు