Video: భారీ సిక్స్ బాదిన పొలార్డ్.. కట్‌చేస్తే.. మహిళకు తాకిన బంతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

|

Jul 23, 2024 | 1:11 PM

MLC 2024: టీ20 ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. సోమవారం జరిగిన లీగ్‌లోని 19వ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు, షారూక్ యాజమాన్యంలోని లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ జట్టు 18 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది.

Video: భారీ సిక్స్ బాదిన పొలార్డ్.. కట్‌చేస్తే.. మహిళకు తాకిన బంతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Kieron Pollard
Follow us on

MINY Skipper Kieron Pollard: టీ20 ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. సోమవారం జరిగిన లీగ్‌లోని 19వ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు, షారూక్ యాజమాన్యంలోని లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ జట్టు 18 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టుకు పిడుగుపాటులా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ కీరన్ పొలార్డ్.. విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఓ మహిళా అభిమాని, ఆమె భర్తకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.

క్షమాపణలు చెప్పిన పొలార్డ్..

ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన కీరన్ పొలార్డ్ బ్యాట్‌తో అద్భుతంగా సహకరించాడు. తన ఇన్నింగ్స్‌లో 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పొలార్డ్ 33 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్ నుంచి 2 బౌండరీలు, 3 సిక్సర్లు వచ్చాయి. ఈ మూడు సిక్సర్లలో ఒకటి మిడ్ వికెట్ మీదుగా వచ్చింది. అయితే ఈ సిక్సర్ స్టాండ్స్‌లో కూర్చున్న ఓ మహిళా అభిమాని భుజానికి తగిలింది. వెంటనే అభిమాని నొప్పితో విలపించడం ప్రారంభించింది.

చివరికి న్యూయార్క్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత, పొలార్డ్ తన సిక్స్‌తో గాయపడ్డ మహిళా అభిమానిని కలవాలని నిర్ణయించుకున్నాడు. పొలార్డ్ స్వయంగా మహిళా అభిమాని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ఆమె భర్తకు కూడా క్షమాపణలు తెలిపాడు. ఆ తర్వాత, పొలార్డ్ ఈ జంటతో సెల్ఫీ దిగాడు. వారికి తన ఆటోగ్రాఫ్‌తో కూడిన క్యాప్ అందించాడు.

పొలార్డ్ టీమ్‌ దూకుడు..

న్యూయార్క్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించడంలో కీరన్ పొలార్డ్ హీరోగా నిలిచింది. నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ చేస్తూ అవుట్ చేసిన పొలార్డ్.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 275 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో, ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా, నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో నైట్ రైడర్స్ 7 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..