ICC Womens Rankings: టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వన్డే ర్యాకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని చేరుకుంది. దాదాపు 16 సంవత్సరాల తరువాత టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నేడు విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్ లో మిథాలీ రాజ్ తో పాటు యూవ ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా మెరుగైన స్థానం సంపాదించింది. మిథాలీ రాజ్ తన 22 ఏళ్ల కెరీర్లో 8వ సారి అగ్ర స్థానాన్ని సాధించడం విశేషం. మరో టీమిండియా బ్యాటర్స్మృతి మంధాన 701 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. భారత్ కెప్టెన్ 762 పాయింట్లతో నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లె లీ 758 పాయింట్లతో రెండవ స్థానం, ఆస్ట్రేలియా బ్యాటర్ హెయిలీ 756 పాయింట్లతో మూడవ స్థానం, ఇంగ్లండ్ బ్యాటర్ బీయ్ మౌంట్ 754 పాయింట్లతో నాలుగవ స్థానం, వెస్టిండీస్ బ్యాటర్ టైలర్ 746 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇక బౌలింగ్ లో ర్యాకింగ్స్ ను పరిశీలిస్తే.. టీమిండియా నుంచి జూలన్ గోస్వామి 694 పాయింట్లతో 4వ స్థానం, పూనమ్ యాదవ్617 పాయింట్లతో 9 స్థానం పొందారు. ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాస్సెన్ 808 పాయింట్లతో తొలి స్థానం పొందగా, మేఘన్ షట్762 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా నుంచి క్రికెటర్ దీప్తి శర్మ 331 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ మరిజన్నె కప్ నిలవగా, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లిసా పెర్రి రెండవ స్థానంలో నిలిచింది.
ఇక టీ20 ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. బ్యాటింగ్ లో టాప్‌టెన్ లో ఇద్దరు టీమిండియా మహిళా క్రికెటర్లు చోటు సంపాదించారు. షెఫాలీ వర్మ 776 పాయింట్లతో అగ్రస్థానం పొందగా, స్మృతి మంధాన 693 పాయంట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ 705 పాయింట్లతో 5వ స్థానం, రాధా యాదవ్ 702 పాయింట్లతో 6వ స్థానం పొందింది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 304 పాయింట్లతో 5వ ర్యాంకులో నిలిచింది.
? @M_Raj03 is the new No.1 ?
In the latest @MRFWorldwide ICC Women’s ODI Player Rankings for batting, the India skipper climbs to the ? of the table.
Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/2HIEC49U5i
— ICC (@ICC) July 6, 2021
Also Read:
Ind Vs Eng: టీమిండియాతో సిరీస్.. ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా!