ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో ఆసీస్ విజయం సాధించి.. సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ దశలో బెన్ స్టోక్స్ జట్టుకు అండగా నిలిచాడు. 8 ఫోర్లు, 2 సిక్సులతో అర్థశతకం సాధించిన స్టోక్స్ 115 బంతుల్లో 89 పరుగులు చేసి.. జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నంలో… మిచెల్ స్టార్క్ వేసిన 37వ ఓవర్ చివరి బంతికి స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అద్భుతమైన యార్కర్‌తో స్టార్క్.. స్టోక్స్‌ని పెవిలియన్ బాటపట్టించాడు.
కాగా ఈ బంతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ బాల్‌ని.. బాల్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ప్రకటించాలని అభిమానులు అంటున్నారు. ‘‘క్రీజ్‌లో పూర్తిగా సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్‌ని స్టార్క్ చాలా అద్భుతంగా ఔట్ చేశాడు’’ అని ఒకరు ట్వీట్ చేశాడు. ‘‘నేను చూసిన బెస్ట్ యార్కర్లలో ఇది ఒకటి’’ అని మరొకరు, అది బ్యాట్స్‌మెన్ తప్పు కాదు.. బౌలర్ గొప్పదనం’’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Starc gets Stokes with a ? yorker!#CmonAussie | #CWC19 pic.twitter.com/9BRwsv4YpW
— ICC (@ICC) June 25, 2019
Good morning Australia!
If you're just waking up and didn't manage to catch the action overnight, start your day by watching the defending world champions rip through England at Lord's to move into the #CWC19 semi-finals! #CmonAussie pic.twitter.com/G6kYqU3oqY
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019