Mumbai Indians vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు. రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ముంబై 5, పంజాబ్ 6 మ్యాచ్‌లు ఆడగా, రెండూ తలో 3 మ్యాచ్‌లు గెలిచాయి. టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి, హ్యాట్రిక్ కొట్టింది. తొలి 2 మ్యాచ్‌ల్లో బెంగళూరు, చెన్నైతో జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై పరాజయం పాలైంది. ఆ జట్టు తర్వాతి 3 మ్యాచ్‌ల్లో ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లను ఓడించి పుంజుకుంది. ముంబై ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్‌లో మంచి ఆరంభాన్ని కలిగి ఉంది. మొదటి 2 మ్యాచ్‌లను గెలుచుకుంది. రాజస్థాన్, కోల్‌కతా జట్లను హోరాహోరీగా ఓడించింది. అయితే చివరి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ జట్టు లక్నోపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌లపై ఓడిపోయింది.
ఇరు జట్లు:
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
పంజాబ్ కింగ్స్ సబ్స్: నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, సికందర్ రజా, రిషి ధావన్, గుర్నూర్ బ్రార్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్.