MI vs DC, IPL 2022: IPL-2022 లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు ఈరోజు వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఢిల్లీ టీంలో రొవ్‌మెన్ పావెల్ 43 పరుగులు (34 బంతులు, 1 ఫోర్, 4 సిక్సులు)లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆ తర్వాత రిషబ్ పంత్ 39 (33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), షా 24, పరుగులతో ఆకట్టుకున్నారు. బుమ్రా 3, రమన్‌దీప్ 2, సామ్స్, మార్కాండే తలో వికెట్ పడగొట్టారు.
జట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఓడించాలి.
ఈ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై మధ్య జరుగుతున్నప్పటికీ, బెంగళూరు కూడా ఈ మ్యాచ్‌పై దృష్టి పెడుతుంది.
5 వికెట్ల తేడాతో ఢిల్లీ పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్
155 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ముంబై.. తిలక్ వర్మ 21 అవుట్..
వరుసగా వికెట్లు కోల్పోతున్న ముంబై .. మరో వికెట్.. ముంబై .. స్కోర్ 145/4
15 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోర్ .. 100/3
వరుస వికెట్లు కోల్పోతున్న ముంబై.. స్కోర్ 95 పరుగులకు మూడు వికెట్లు.
48 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ముంబై స్కోర్ 77/2
ఆచితూచి ఆడుతున్న ముంబై.. పది ఓవర్లకు ముంబై స్కోర్ ఎంతంటే..62/1
తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోషిత్ శర్మ (2) పరుగులకు అవుట్ అయ్యాడు. స్కోర్ 25/1
2 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 0, ఇషాన్ కిషన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 161 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
18 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. రొవ్‌మన్ పొవెల్ 43, అక్షర్ పటేల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పావెల్ (43 పరుగులు, 34 బంతులు, 1 ఫోర్, 6 సిక్స్‌లు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 18.2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ టీం 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ (39 పరుగులు, 33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ టీం 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
14 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. పంత్ 22, రొవ్‌మన్ పొవెల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. పంత్ 21, రొవ్‌మన్ పొవెల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. పంత్ 12, రొవ్‌మన్ పొవెల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సర్ఫరాజ్ ఖాన్ (10) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 8.4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ టీం 4 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.
8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. పంత్ 9, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
షా(24) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 5.4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ టీం 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.
5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. షా 22, పంత్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. డేవిడ్ వార్నర్ 5, మిచెల్ మార్ష్ 0 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
ముంబై ఇండియన్స్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం ప్లేఆఫ్‌కు చేరే నాలుగో టీంను ఖాయం చేస్తుంది. ముంబై గెలిస్తే బెంగళూర్, ఓడితే ఢిల్లీ టీం ప్లే ఆఫ్ చేరనుంది.
రెండు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న గణాంకాలను చూస్తే.. ముంబై జట్టుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య మొత్తం 31 మ్యాచ్‌లు జరగగా, అందులో ముంబై 16 మ్యాచ్‌లు గెలుపొందగా, ఢిల్లీ 15 మ్యాచ్‌లు గెలిచింది.