MI vs CSK Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 12వ మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చెన్నై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 32 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 22 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
చెన్నై తరపున రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలో 2 వికెట్లు తీశారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన 2 జట్లు కాసేపట్లో ఒకరితో ఒకరు తలపడబోతున్నాయి. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, 4 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో వాంఖడే మైదానంలో ఢీకొట్టనుంది. అయితే, అందరి చూపు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలపైనే ఉంటుంది. లీగ్‌లో ఖాతా తెరవాలని ముంబై కన్నేసింది. కాగా, విజయ యాత్రను నిలబెట్టుకోవడమే చెన్నై ప్రయత్నంగా తెలుస్తోంది.
ఇరుజట్లు..
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే.
ఐపీఎల్ హిస్టరీలో రెండో వేగవంతమైన హాఫ్ సంచరీ రికార్డు మొయిన్ ఆలీ పేరిట ఉండగా.. దానిని అజింక్యా రహానే సమం చేశాడు. చెన్నై, ముంబై మధ్య జరుతున్న మ్యాచ్‌లో వన్ డౌన్‌గా దిగిన రహానే 19 బంతుల్లోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 5వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచిన రహానే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక అంతకముందు ఈ రికార్డు మొయిన్ ఆలీ పేరటి ఉండేది. 2022 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌పై అతను 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ ఐపీఎల్ రికార్డు సురేష్ రైనా పేరిట ఉంది. 2014 లో చెన్నై, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రైనా కేవలం 14 బంతులలోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు
చెన్నై టీం 3 ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే ఉన్నారు.
సున్నా పరుగుల వద్ద చెన్నై టీం తొలి వికెట్ కోల్పోయింది. డేవాన్ కాన్వే పెవిలియన్ చేరాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 12వ మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చెన్నై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 32 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 22 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
చెన్నై తరపున రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలో 2 వికెట్లు తీశారు.
ముంబై 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
13 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
22 పరుగుల వద్ద తిలక్ వర్మ అవుటయ్యాడు. రవీంద్ర జడేజా అతడిని ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. జడేజాకు ఇది మూడో వికెట్. ఇషాన్ కిషన్ 32, కెమరూన్ గ్రీన్ 12 పరుగులను అవుట్ చేశాడు.
అంతకుముందు రోహిత్ శర్మ 21, అర్షద్ ఖాన్ 2, సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగుతో ఔటయ్యారు. రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు తీశారు. తుషార్ దేశ్ పాండే ఒక వికెట్ తీశాడు.
8.2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 21, ఇషాన్ కిషన్ 32, సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు, గ్రీన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. రవీంద్ర జడేజా 2, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.
7 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అనంతరం ఇషాన్ కిషన్ జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ అందించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్.
ఐపీఎల్ 2023లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల జట్లు సిద్ధమయ్యాయి. IPL 2023 12వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.