
Zahiduzzaman Khan Sagor Unusual Wicketkeeper Celebration: బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో ఉంది. ఇటు ఐసీసీ, అటు బీసీసీఐ దెబ్బకు ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఓ ఆసక్తికర ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. లైవ్ మ్యాచ్ లో ఈ ఆటగాడి విన్యాశాలు చూసి సోషల్ మీడియాలో నవ్వుల వర్షం కురుస్తోంది. అసలు ఎవరు ఆ ఆటగాడు, ఆయన చేసే విన్యాశాలు ఏంటో ఓసారి చూద్దాం.. దేశవాళీ క్రికెట్‌లో పేరుగాంచిన బంగ్లా ప్లేయర్ జహిదుజ్జమాన్ ఖాన్ సాగర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. బీపీఎల్‌లో తన స్టన్నింగ్ కీపింగ్ స్కిల్స్ తో సంచలనంగా మారాడు. గతంలోనూ బీపీఎల్ ఆడిన అనుభవం ఉన్నా.. ఈ ఏడాది మాత్రం తన వెరైటీ స్టైల్స్ తో నవ్వులు పూయిస్తున్నాడు.
తాజాగా జరిగిన ఒక మ్యాచ్‌లో బ్యాటర్ ఔట్ అయిన వెంటనే తన వికెట్ కీపింగ్ గ్లోవ్స్ తీసేసి, మైదానంలో వింతగా డ్యాన్స్ చేస్తూ, గాలిలో విన్యాసాలు చేస్తూ సందడి చేశాడు. మాములుగా అయితే, బౌలర్లు లేదా ఫీల్డర్లు సంబరాలు చేస్తుంటారు. కానీ ఒక కీపర్ ఇలా చేయడం మాత్రం చాలా అరుదు. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్ (X) లో తెగ వైరలవుతోంది.
What the Hell Bludd Doing?
Meet Zahiduzzaman Khan Sagor 🇧🇩
The most unconventional wicketkeeper you’ll see. Not his first BPL, but he definitely made this one unforgettable with that celebration 🔥#BPL #BPL2026. pic.twitter.com/gIEzHWVTyp
— Shadman Sakib Arnob (@arnuX05) January 21, 2026
సాగర్ తన కీపింగ్ స్టైల్‌తో చాలా వింతగా ఉంటాడు. టెక్నిక్ కంటే తన ఎనర్జీతో టీంలో ఉత్సాహాన్ని నింపుతుంటాడు. కాగా, ఈ సెలబ్రేషన్ మాత్రం కొంచెం అతిగా ఉందని కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం వినోదాత్మకంగా ఉందని చెబుతున్నారు. క్రికెట్ అంటే కేవలం సీరియస్ ఆట మాత్రమే కాదని, ఇలాంటి సరదా సంఘటనలు కూడా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఇలాంటి ఎన్నో వింతలకు మారుపేరుగా మారింది. అంపైర్ల తప్పిదాల నుంచి, రమీజ్ రాజా కామెంటరీ గందరగోళం వరకు.. తాజాగా, సాగర్ సెలబ్రేషన్.. ఇలా ఏదో ఒక విషయం ప్రతిరోజూ చర్చనీయాంశమవుతూనే ఉంది. ఏది ఏమైనా జహిదుజ్జమాన్ సాగర్ మాత్రం ఈ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ అయిపోయాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..