
రింకూ సింగ్.. ఈ పేరు మరోసారి నెట్టింట మారుమ్రోగుతోంది. ఐర్లాండ్ సిరీస్‌తో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రింకూ సింగ్.. టీమిండియాకు నయా ఫినిషర్‌గా మరోమారు తానేంటో నిరూపించుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో మెరుపులు మెరిపించిన రింకూ సింగ్.. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో యష్ దయాల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు బాదేసిన రింకూ సింగ్.. ఇప్పుడు యూపీ టీ20 లీగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించాడు. సూపర్ ఓవర్‌లో అతడు ఇచ్చిన ఫినిషింగ్ ఇప్పుడు.. నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ మాదవ్ కౌశిక్(87) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక అనంతరం బ్యాటింగ్‌కి దిగిన కాశీ రుద్రస్ జట్టు కూడా 20 ఓవర్లలో 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో మ్యాచ్ కాస్తా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాశీ రుద్రస్ 16 పరుగులు చేసి.. మీరట్ జట్టుకు 17 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మావెరిక్స్ జట్టు ఈ టార్గెట్‌ను కేవలం 4 బంతుల్లోనే ముగించి.. విజేతగా నిలిచింది. కాశీ రుద్రస్ స్పిన్నర్ శివమ్ సింగ్ బౌలింగ్‌లో రింకూ సింగ్ వరుసగా మూడు బంతుల్లో 3 హ్యాట్రిక్ సిక్సర్లు బాదేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా, ఐపీఎల్ 2023లో రింకూ సింగ్.. గుజరాత్ టైటాన్స్‌పై ఇదే తరహా ఫీట్ సాధించాడు. కేకేఆర్‌కు ఆఖరి ఓవర్‌లో 31 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ జట్టు బౌలర్ యష్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 6,6,6,6,6 బాదేసి.. కేకేఆర్‌కు సూపర్ విక్టరీ అందించాడు రింకూ సింగ్. అటు ఆసియా గేమ్స్ స్క్వాడ్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు రింకూ సింగ్. ఈ టీంకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తుండగా.. హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇదే ఆటతీరు రింకూ సింగ్ కొనసాగిస్తే.. వరల్డ్‌కప్ స్క్వాడ్‌తో పాటు స్వదేశంలో జరగబోయే ఆస్ట్రేలియాకు కూడా ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..