అరంగేట్రంలోనే అదరగొట్టిన వెస్టిండీస్ ​ఆటగాడు.. 144 ఏళ్ల రికార్డును బ్రేక్​చేసిన కేల్​ మేయర్స్

|

Feb 07, 2021 | 7:04 PM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. విజయంలో కేల్​ మేయర్స్​ కీలకంగా వ్యవహరించాడు.

అరంగేట్రంలోనే అదరగొట్టిన వెస్టిండీస్ ​ఆటగాడు.. 144 ఏళ్ల రికార్డును బ్రేక్​చేసిన కేల్​ మేయర్స్
Kyle Mayers
Follow us on

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. విజయంలో కేల్​ మేయర్స్​(40,210*) కీలకంగా వ్యవహరించాడు. విండీస్‌కు 395 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చిన బంగ్లాదేశ్‌కు తమ గడ్డపైనే ఎంట్రీ ఆటగాడు కేల్​ మేయర్స్​ అదిరిపోయే షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. విండీస్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్​మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. విండీస్‌కు 395 పరుగుల టార్గెట్‌ను ఇచ్చిన బంగ్లాదేశ్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు కేల్.
మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్.. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో 395 భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచి ఇన్నింగ్స్‌ను బంగ్లా డిక్లేర్ చేసింది. అనంతరం నాలుగో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది విండీస్. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కేల్ మేయర్స్‌ తమ జట్టును అద్భుతంగా ఆదుకున్నాడు. 310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 పరుగులు చేసి విండీస్‌కు విజయాన్ని అందించాడు.

ఇదో చరిత్ర…

144ఏళ్ల టెస్టు క్రికెట్​ చరిత్రలో డెబ్యూ మ్యాచులోనే డబుల్ సెంచరీ చేసి తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు మేయర్స్. ఈ పోరులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో ఐసీసీ తన ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించింది.

అంతేకాదు ఆదే సీనియర్ ఆటగాళ్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వీరితో పాటు టీమిండియా దిగ్గజ ఆటగాడు సెహ్వాగ్ సైన ప్రశంసించాడు. “నమ్మలేకపోతున్నాను. బంగ్లాదేశ్​ను వారి గడ్డపైనే మట్టికరిపించిన కేల్​ మేయర్స్​(210)కు ధన్యావాదాల. ఈ ఏడాది మిగతా జట్లపై విండీస్​ ఆధిపత్యం చెలాయిస్తుంది.” అని సెహ్వాగ్​ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి :

India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌ 59/2
Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!