Mayank Agarwal Auction Price : పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు మినీ వేలంలో మంచి ధర లభించింది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడి కోసం హోరాహోరీగా పోటీపడగా.. అనూహ్యంగా సన్‌రైజర్స్ బిడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రూ. 8 కోట్ల వరకు తీసుకెళ్లి.. చివరిగా రూ. 8. 25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్ దక్కించుకుంది.
ఇదిలా ఉంటే.. రాహుల్‌తో పాటు గత రెండు సీజన్లలోనూ పంజాబ్‌కు టాప్ రన్ గెట్టర్‌గా నిలిచాడు మయాంక్ అగర్వాల్. ఇక ఈ ఏడాది రాహుల్ స్థానంలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్.. టోర్నమెంట్ చివరికి ఆ జట్టును ఫైనల్ చేర్చలేకపోయాడు. అందుకే మినీ వేలానికి ముందు పంజాబ్ ఫ్రాంచైజీ అతడ్ని వదులుకుంది. ఇక హైదరాబాద్ మయాంక్‌ను వేలంలో అందిపుచ్చుకుంది.
కాగా, మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 113 మ్యాచ్‌లు ఆడి 2331 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
14 అక్టోబర్ 2010న, అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాపై తన T20I అరంగేట్రం చేశాడు. ఇక్కడ అగర్వాల్ 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
23 ఫిబ్రవరి 2012న విజయ్ హజారే ట్రోఫీలో తెలంగాణపై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. 7 నవంబర్ 2013న, అతను రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌పై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
నవంబర్ 2017లో, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు, అతను 2017–18 రంజీ ట్రోఫీలో మహారాష్ట్రకు వ్యతిరేకంగా కర్ణాటక తరపున 304 పరుగులు చేసి నాటౌట్ చేశాడు.
26 డిసెంబర్ 2018న అగర్వాల్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు.
5 ఫిబ్రవరి 2020న అగర్వాల్ న్యూజిలాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు. ఇక్కడ అగర్వాల్ 31 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మొత్తంగా 5 వన్డేలు ఆడిన అగర్వాల్ 86 పరుగులు చేశాడు.
ఇక టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన అగర్వాల్.. మొత్తం 21 టెస్టులు ఆడి 1488 పరుగులు సాధించాడు.
మయాంక్ అగర్వాల్ IPL వేలంలో పొందిన ప్రైజ్ వివరాలు..
సంవత్సరం | వేలం ధర | జట్టు |
---|---|---|
2018 | రూ. 1 కోటి | పంజాబ్ |
2019 | రూ. 1 కోటి | పంజాబ్ |
2020 | రూ. 1 కోటి | పంజాబ్ |
2021 | రూ. 1 కోటి | పంజాబ్ |
2022 | రూ. 12 కోట్లు | పంజాబ్ |
IPL గణాంకాలు..
సంవత్సరం | మ్యాచ్‌లు | పరుగులు |
---|---|---|
2011 | 8 | 141 |
2012 | 16 | 225 |
2013 | 5 | 67 |
2014 | 8 | 115 |
2015 | 10 | 213 |
2016 | 3 | 27 |
2017 | 3 | 26 |
2018 | 11 | 120 |
2019 | 13 | 332 |
2020 | 11 | 424 |
2021 | 12 | 441 |
Ma-Yanka Agarwal ane power undi sir! ? #OrangeArmy #BackToUppal #TataIPLAuction pic.twitter.com/VEc1h0Wnkl
— SunRisers Hyderabad (@SunRisers) December 23, 2022