Cricket Scam : టీమ్‌లోకి రావాలంటే రూ.1.2 లక్షల డీల్.. బీసీసీఐ కళ్ల ముందే భారీ స్కామ్

Cricket Scam : ప్రపంచ క్రికెట్‌ను ఐసీసీ నడిపినట్టే, భారత క్రికెట్‌ను బీసీసీఐ నడుపుతుంది. కొత్త టాలెంటును వెలికితీయడంలో ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేయడంలో బీసీసీఐ ఎంత గానో కృషి చేస్తోంది. అయితే పుదుచ్చేరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

Cricket Scam : టీమ్‌లోకి రావాలంటే రూ.1.2 లక్షల డీల్.. బీసీసీఐ కళ్ల ముందే భారీ స్కామ్
Bcci

Updated on: Dec 09, 2025 | 10:59 AM

Cricket Scam : ప్రపంచ క్రికెట్‌ను ఐసీసీ నడిపినట్టే, భారత క్రికెట్‌ను బీసీసీఐ నడుపుతుంది. కొత్త టాలెంటును వెలికితీయడంలో ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేయడంలో బీసీసీఐ ఎంతో కృషి చేస్తోంది. అయితే పుదుచ్చేరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ బీసీసీఐ కళ్ల ముందు జరుగుతున్న ఫేక్ అండ్ ఫ్రాడ్ వ్యవహారం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పుదుచ్చేరిలో క్రికెట్ టీమ్‌లలోకి రావడానికి ఆటగాళ్లు షార్ట్‌కట్ ఎంచుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరికి పనిచేస్తూ, డబ్బు కోసం ఈ దందా నడుపుతున్నారు. డబ్బు తీసుకుని ఫేక్ అడ్రస్‎లు క్రియేట్ చేయడం, అర్హత ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారు. బీసీసీఐ అండర్లోనే జరుగుతున్న ఈ అక్రమాన్ని ప్రముఖ మీడియా దర్యాప్తులో బయటపడింది.

గత 3 నెలల్లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 2,000కు పైగా ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ఫారాలను పరిశీలించింది. డజనుకు పైగా మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు, అధికారులతో మాట్లాడింది. అంతేకాకుండా నివాస, విద్యా సంస్థలకు సంబంధించిన అనేక చిరునామాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ దర్యాప్తు ద్వారా ఒక వ్యవస్థీకృత చట్టవిరుద్ధ వ్యవస్థ నడుస్తున్నట్లు తేలింది. దీనిని అక్కడి ప్రైవేట్ క్రికెట్ అకాడమీ కోచ్‌లు నిర్వహిస్తున్నారు. వీరు వేరే రాష్ట్రాలకు చెందిన క్రికెటర్ల కోసం నకిలీ డాక్యుమెంట్లు క్రియట్ చేస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం పుదుచ్చేరిలో ఉండాల్సిన ఒక సంవత్సరం నివాస అవసరాన్ని ఇలా నకిలీ పత్రాలతో పూర్తి చేయించి, ఆ ఆటగాళ్లను స్థానిక ఆటగాళ్లుగా మారుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ప్యాకేజ్ రూపంలో రూ.1.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి జరుగుతోంది. ఈ అక్రమ మార్గమే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరి వివిధ వయో వర్గాల జట్లలో స్థానం సంపాదించడానికి దారి అవుతోంది.

ఈ అక్రమాలకు అతిపెద్ద సాక్ష్యం ఏమిటంటే.. వివిధ జట్లలో ఆడుతున్న 17 మంది స్థానిక క్రికెటర్లు మోతీనగర్‌లోని ఒకే ఆధార్ చిరునామాను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ ఇంటి యజమానిని సంప్రదించినప్పుడు, అద్దె చెల్లించనందున ఆ అద్దెదారులను నెలల క్రితమే ఖాళీ చేయించామని తెలిసింది. ఈ సిస్టమ్ వల్ల పుదుచ్చేరిలో పుట్టిన స్థానిక ఆటగాళ్లు అవకాశాలు కోల్పోయి, తీవ్రంగా నష్టపోతున్నారు. గత 4 సంవత్సరాలలో పుదుచ్చేరి 29 రంజీ మ్యాచ్‌లు ఆడింది, కానీ అందులో పుదుచ్చేరిలో పుట్టిన ఆటగాళ్లు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. ఈ సీజన్‌లో జరిగిన వీనూ మన్కడ్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్‌లో కూడా జట్టులోని 11 మందిలో 9 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..