Dhoni Son of Sachin : మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్..! ఛత్తీస్‌గడ్‌లో టీచర్ పోస్ట్ కోసం వింత దరఖాస్తు..

Dhoni Son of Sachin : చత్తీస్‌గడ్‌‌లో టీచర్ పోస్టు కోసం ఎంఎస్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్ దరఖాస్తు చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే.

Dhoni Son of Sachin : మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్..! ఛత్తీస్‌గడ్‌లో టీచర్ పోస్ట్ కోసం వింత దరఖాస్తు..
Dhoni Son Of Sachin

Updated on: Jul 03, 2021 | 7:43 PM

Dhoni Son of Sachin : చత్తీస్‌గడ్‌‌లో టీచర్ పోస్టు కోసం ఎంఎస్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్ దరఖాస్తు చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఈ వింత ఛత్తీస్‌గడ్‌లోని టీచర్ రిక్రూట్‌మెంట్‌లో జరిగింది. ఓ ఆకతాయి ఇంగ్లీష్ పోస్టు కోసం మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ పేరుతో ఈ పని చేశాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మార్కుల ఆధారంగా ఈ దరఖాస్తును తుది జాబితాలో ప్రకటించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

రాయదుర్గ్ లో ఎస్విటియు యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇక అతని మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసిన అధికారులు అది నకిలీ నెంబర్ గా గుర్తించి దగ్గరలోని పోలీస్ లకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే మరికొందరు పేర్లను చూసి అది నకిలీ దరఖాస్తు అని తెలుసుకోకుండానే షార్ట్ లిస్టు ఎలా చేసారని, ఇంటర్వ్యూ రౌండ్ కి ఎలా ఆహ్వానిస్తారని పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబందించి దరఖాస్తులను సరిగ్గా తనిఖీ చేయని సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇటీవలే బీహార్ లో కూడా నటి అనుపమ పరమేశ్వరన్ ఫోటో, గతంలో పలువురు హీరో హీరోయిన్స్ ఫోటోలు, పేర్లతో ఇలాంటి పరీక్ష సమయంలో దరఖాస్తు చేసుకున్న ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్లికేషన్‌లో ఉన్న మొబైల్‌ నెంబర్‌కు కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ వస్తోంది.

Breast Cancer : కరోనా ఎఫెక్ట్..! ఇండియాలో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ బాధితులు.. మహిళలు ఈ విషయాలు తెలుసుకోండి..

టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!

Pet Animals License: తెలంగాణలో కుక్కలు, జంతువులకు లైసెన్స్.. పెంచుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!