MS Dhoni: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి ఉండవచ్చు. కానీ నేటికీ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రతి సంవత్సరం ఐపిఎల్‌లో తమ అభిమాన ఆటగాడిని చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. కొన్నాళ్లుగా ధోనీ 7వ నంబర్ జెర్సీని ధరించడం అందరికి తెలిసిందే. ధోనీ ఈ నంబర్‌ను ఎందుకు ఎంచుకున్నాడు అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. దీనికి ఇప్పుడు ధోనీ స్వయంగా సమాధానం చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ MS ధోనీ జూలై 7 న జన్మించినందున ‘నెంబర్ 7’ తనకి బాగా ఇష్టమని చెప్పాడు. అందుకే తన జెర్సీపై నంబర్ 7 ఉంటుందని వెల్లడించాడు. అంతేకాదు ధోని అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి నెంబర్ ‘7’ని తన షర్ట్ నంబర్‌గా ఉపయోగిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఈ నంబర్‌కు ప్రజాదరణ పెరగడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ యజమానుల బృందం, ఇండియా సిమెంట్స్ నిర్వహించిన ఇంటరాక్షన్ సందర్భంగా అభిమానులతో ధోని మాట్లాడారు.
‘మొదట్లో చాలా మంది నెంబర్ 7 నాకు అదృష్ట సంఖ్య అని అనుకున్నారు. కానీ నేను జూలై 7న పుట్టాను. ఏడో నెల ఏడో తేదీ మంచి సంఖ్య. నేను నా పుట్టిన తేదీని ఎంపిక చేసుకున్నానని చెప్పాడు’ CSK గత వారం నుంచి IPL 2022 కోసం సూరత్‌లో శిక్షణ పొందుతోంది. వేదిక వద్ద కల్పిస్తున్న సౌకర్యాలపై కెప్టెన్ ధోని చాలా సంతోషంగా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.