Dhoni Ipl 2021 Records: మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు తెలియని సగటు భారతీయుడు ఉండడనంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తన అసమాన ఆటతీరు, కూల్ నిర్ణయాలతో టీమిండియాకు ప్రపంచకప్‌తో పాటు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఎన్నో అద్భుత విజయాలకు కారణమైన ధోని ఈ క్రమంలో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సాధించిన అద్భుత రికార్డులు ఏంటి..? 2021లో జరగబోయే ఐపీఎల్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం…
* ధోని ఇప్పటి వరకు 204 ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఒక ఆటగాడిగా ఇదే రికార్డు.
* ఎమ్‌ఎస్ ధోని ఆర్‌సీబీపై 832 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ టీమ్‌పై ఓ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
* ధోని ఐపీఎల్‌లో 209 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నారు.
* ఐపీఎల్ 100 విజయాలను నమోదు చేసుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
వికెట్ కీపర్‌గా ధోని ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 148 మందిని పెవిలియన్ బాట పట్టించాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో 150వ మార్కును అందుకోనున్నాడు.
ధోని ఐపీఎల్‌లో 7000 పరుగుల స్కోరుకు కేవలం 179 పరుగులు దూరంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇది సాకారం కానుంది.
ధోని ఐపీఎల్‌లో 200 సిక్సర్లకు కేవలం 14 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 14వ సీజన్‌లో ధోనీ ఈ రికార్డును కూడా సొంతం చేసుకోనున్నాడు.
Tokyo Olympics: దక్షిణ కొరియా, జపాన్‌లకు ఉ.కొరియా షాక్…టోక్యో ఒలంపిక్స్‌కు దూరం..